హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు రోజువారీ చెల్లింపులే ఉంటాయి. ఐతే ఈ కేటగిరీల ఉండే నటుల్లో కూడా కొంతమందికి మంచి డిమాండే ఉంటుంది. ప్రేక్షకులకు వాళ్ల పేర్లు తెలియకపోయినా.. పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు చేయకపోయినా.. ఆ క్యారెక్టర్లకు న్యాయం చేసే పెర్ఫామెన్స్‌తో ఇండస్ట్రీలో డిమాండ్ సంపాదించుకుంటారు. అలాంటి వాళ్లలో వినయ్ మహాదేవ్ ఒకడు.
ఈ యువ నటుడి పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ.. తన ఫేస్ చూస్తే మాత్రం జనాలు బాగానే ఐడెంటిఫై చేస్తాడు. గత మూణ్నాలుగు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న ప్రతి చోటా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఇరుముడి సినిమాలో ఈ నటుడు ప్రాధాన్యమున్న పాత్రే చేశాడు. ఊరి చివర నివాసముంటూ అమ్మాయిలను వేధించే భయానక గ్యాంగ్‌కు లీడర్‌గా నటించాడీ యువ నటుడు.
ఈ పాత్ర తన కెరీర్లో పెద్ద మలుపు అని చెప్పొచ్చు. ఈ సినిమాతో తన పేరు ఎక్కువమందికి తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బిజీ అయ్యేలా కనిపిస్తున్నాడు వినయ్ మహాదేవ్. ఇప్పటికే తనకున్న డిమాండ్ దృష్ట్యా రోజుకు రూ.40 వేలు పారితోషకం తీసుకుంటున్నట్లు వినయ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. మరి ఇరుముడికి ఎన్ని రోజులు పని చేశారు అని అడిగితే.. అది గుర్తు లేదన్నాడు.
ఇరుముడి చేస్తున్న సమయంలో ఇంకో నాలుగు సినిమాలు చేస్తూ ఉన్నానని.. కాబట్టి ఈ చిత్రానికి ఎన్ని రోజులు పని చేశానో గుర్తు లేదని.. అదంతా మేనేజర్ చూసుకున్నాడని.. ఎన్ని రోజులు పని చేస్తే అన్ని 40 వేలు తీసుకున్నానని వినయ్ తెలిపాడు. ఇలాంటి చిన్న నటుడికే రోజుకు రూ.40 వేలు ఇస్తున్నారంటే ఒక సినిమాలో అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు కలిపి పారితోషకాల రూపంలో ఎంత ఖర్చవుతుందో.. ప్రొడక్షన్ కాస్ట్ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on September 13, 2026 8:00 pm
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…
యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…
చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి…
ఇండోనేషియా లోని జావా సముద్రంలో జరిగిన నౌక ప్రమాదంతో ఈ ఆదివారం తెలవారింది. సముద్రం మధ్యలో నౌక మునిగిపోవడంతో 140…