యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న వైనం బాక్సాఫీస్ నెంబర్లలో కనిపిస్తోంది. మొదటి రోజు అయిదు కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అంకెలు కొంచెం భిన్నంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల అనఫీషియల్ రిపోర్ట్. టీమ్ ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ థియేటర్లను చుట్టేస్తూ ప్రమోషన్స్ చేసుకోవడంలో బిజీగా ఉంది. ఇవి ఎంత మేరకు దోహదపడతాయో వేచి చూడాలి.
ఇక అసలు విషయానికి వస్తే ఎపిక్ ఎందుకు కనెక్ట్ కాలేకపోయిందనే దాని మీద మూవీ లవర్స్ డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి. ఒక కుర్ర జంట మధ్య లవ్, సెక్స్, ఎమోషన్స్ ని రిసీవ్ చేసుకునేందుకు జనం సిద్ధంగా లేరానే ప్రశ్న తలెత్తుతోంది. ఇక్కడ సమాధానం సింపుల్. వాళ్ళు రెడీగా ఉంటారు, ఉన్నారు. కాకపోతే కన్విన్స్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. అదెలాగో చూద్దాం. గీతాంజలిలో డ్రామా నాగార్జున, గిరిజల మధ్యే ఎక్కువగా ఉంటుంది. కానీ వినోదం బాధ్యతను ఇతర పాత్రలకూ పంచారు మణిరత్నం.
అంటే బామ్మ, చిన్న పిల్లలు, ఇతర సపోర్టింగ్ ఆర్టిస్టులతో కూడా ఫన్ రప్పించి భావోద్వేగాలను హీరో హీరోయిన్ తల్లి తండ్రులకు వదిలేస్తారు.అది మరీ పాతది అనుకుంటే కొత్త ఉదాహరణ చూద్దాం. లిటిల్ హార్ట్స్ రివైండ్ చేసుకుంటే సరదాగా సాగిపోతూ, కాంఫ్లిక్ట్ ఎప్పుడు రావాలో దాన్ని సరైన టైంలో ప్రవేశపెట్టి, తిరిగి ప్రీ క్లైమాక్స్ నుంచి వినోదం పంచుతారు. అందుకే ఫ్యామిలీస్ కూడా చూశాయి. ఎపిక్ ఇలాంటి ఆర్గానిక్ ఫన్ మిస్సయిపోయి ఆనంద్, వైష్ణవి అవసరానికి మించిన కెమిస్ట్రీ డామినేట్ చేసింది.
సుదీర్ఘమైన సంభాషణలు, రిపీట్ అనిపించే సన్నివేశాలతో ఆడియన్స్ ని రెండున్నర గంటల సేపు మెప్పించడం కష్టం. దర్శకుడు ఆదిత్య హాసన్ ఆలోచనలో ఎంత నిజాయితి ఉన్నా టికెట్ కొన్న ప్రేక్షకుడికి సందేశాలు, భావోద్వేగాల కన్నా ఎక్కువగా ఆనందాన్ని పంచే అంశాలు కావాలని గుర్తించలేకపోవడం లోపంగా మారింది. పైగా హేశం సంగీతంలో మంచి పాటలు ఉన్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఛార్ట్ బస్టర్స్ లేవు. ఇవన్నీ కలగలసి ఎపిక్ కు రావాల్సిన రెస్పాన్స్ తగ్గించాయని చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates