Movie News

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా అది ఓటిటి సినిమా కావడంతో తన థియేటర్ కెపాసిటీ బయట పడలేదు. రైటర్ పద్మభూషణ్ హిట్ అయిన ఆనందం తర్వాత వచ్చిన ప్రసన్నవదనం లాంటివి నీరుగార్చేశాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒకటే ఓ మోస్తరుగా ఆడింది. వేగంగా పరుగులు పెట్టడంలో చూపించిన తపన హే బలవంత్ లాంటి తప్పులకూ ప్రేరేపించింది. తమిళ ఆఫర్ మండాడిని ఒప్పుకున్నప్పుడు అందరిలో ఎన్నో అనుమానాలు.

రిలీజ్ తర్వాత అవన్నీ పటాపంచలు అయ్యాయి. ఒక కుర్రాడికి తండ్రిగా నటించినా సరే అదసలు మైనస్ కాదన్నట్టుగా పెర్ఫార్మన్స్ తో చెలరేగిపోయిన సుహాస్ మీద కోలీవుడ్ వర్గాల్లో ప్రశంసలు వినిపిస్తున్నాయి. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆల్రెడీ తమ ప్రాజెక్టులో లాక్ చేసుకుంటే ఒకదాంట్లో తనే హీరో. ఇంటెన్స్ యాక్టింగ్ తో ఈ మధ్య ఎక్కువగా ఆకట్టుకుంటున్న సూరిని ఎదురుగా పెట్టుకుని కూడా సుహాస్ తనదైన గుర్తింపు తెచ్చుకోవడం ఆషామాషీగా చూడాల్సిన విషయం కాదు.

సుహాస్ కు తమిళం రాదు. ఒరిజినల్ వెర్షన్ డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పించారు. అయినా సరే హావభావాలు డైలాగ్ డెలివరీతో విమర్శకులను మెప్పించాడు. ముఖ్యంగా సూరి స్నేహితుడి కొడుకుని చంపడానికి పూనుకున్న సన్నివేశాల్లో, ఊరి పెద్దలు పంచాయితీ పెడితే వాళ్ళను ఎదిరించే ఎపిసోడ్ లో బెస్ట్ ఇచ్చాడు. వాటర్ సీక్వెన్స్ లో కూడా చాలా రిస్క్ చేసి సముద్రం మీద చేసిన విన్యాసాలు మంచి అవుట్ ఫుట్ ఇచ్చాయి. ఫైనల్ గా సుహాస్ కోరుకున్న బ్రేక్ దక్కింది.

ఇకపై అవకాశాలు తెలుగు తమిళం దేంట్లో ఎక్కువ వస్తాయనేది ఠక్కున చెప్పలేం కానీ సుహాస్ ఎలాంటి వాటికి సూటవుతాడో ఒక క్లారిటీ వచ్చింది. తన శరీర ఛాయ, ఎక్స్ ప్రెషన్లు కోలీవుడ్ నేటివిటీకే బాగా సూట్ అయ్యేలా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వరస ఫ్లాపులతో సతమతమవుతున్న సుహాస్ కు ఇప్పుడీ మండాడి పెద్ద రిలీఫ్. కెరీర్ ని మరింత బాగా నిర్మించుకోవడానికి అవకాశం దక్కింది. దీన్ని సరైన రీతిలో ప్లాన్ చేసుకుంటే సుదీర్ఘమైన ఇన్నింగ్స్ కు దారి దొరికినట్టే.   

This post was last modified on September 13, 2026 10:23 am

Share

Recent Posts

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

28 minutes ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

2 hours ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

3 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

3 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

4 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

4 hours ago