ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే స్టార్లను పెట్టేస్తే జనాలు ఎగబడి చూస్తారనే భ్రమలో ఇప్పటికీ కొందరు తప్పులు చేస్తూనే ఉన్నారు. తాజాగా విడుదలైన బాలీవుడ్ మూవీ ‘హైవాన్’ గురించే ఇప్పుడీ డిస్కషన్. కల్ట్ మేకర్ గా పేరొందిన ప్రియదర్శన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ రివెంజ్ డ్రామాలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ నటించగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది.
ప్రాబ్లమ్ ఏమిటంటే హైవాన్ కథ కొత్తది కాదు. 2016 ఇదే ప్రియదర్శన్ తీసిన ఒప్పంకు రీమేక్. తెలుగులో కనుపాప పేరుతో డబ్బింగ్ చేశారు. మోహన్ లాల్, సముతిరఖని ప్రధాన పాత్రలు పోషించగా ఒరిజినల్ వెర్షన్ మంచి విజయం సాధించింది. పది సంవత్సరాల తర్వాత దీన్ని రీమేక్ చేయాలనుకోవడమే పెద్ద సాహసం. అయితే ప్రియదర్శన్ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ స్టోరీలో సోల్ తీసుకుని చాలా మార్పులు చేశామని, కాబట్టి రీమేకని పిలవొద్దని చాలా చెప్పుకొచ్చారు.
అయినా లాభం లేకపోయింది. హైవాన్ కు జనాల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. రివ్యూలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. నెగటివ్ షేడ్స్ లో అక్షయ్ కుమార్ బాగా నటించినప్పటికీ ఆయన్ని అలా చూసే మూడ్ లో ఆడియన్స్ లేకపోవడం ఫలితాన్ని శాసిస్తోంది. అన్నట్టు మోహన్ లాల్ ఇందులో చిన్న క్యామియో చేయడం మరో ట్విస్టు. మొదటి రెండు రోజుల వసూళ్లు పట్టుమని పది కోట్లను కూడా టచ్ చేయలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.
ఏదో ప్రియదర్శన్ చెప్పారు కానీ కథలో పెద్దగా మార్పులు లేవు. ఒక జడ్జ్ మీద ప్రతీకారంతో రగిలిపోయిన నేరస్థుడు ఆయన్ను చంపాక కూతురిని టార్గెట్ చేసుకుంటాడు. జడ్జ్ కేర్ టేకర్ గా ఉన్న గుడ్డివాడైన వ్యక్తి ఆ పాపను ఎలా రక్షించాడనేది ఇందులో మెయిన్ పాయింట్. దాదాపు యధాతథంగా తీసినప్పటికీ ఒప్పం స్థాయిలో హైవాన్ కంటెంట్ కుదరలేదు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ బాగున్నా వీక్ నెరేషన్ వల్ల తేలిపోయింది. అయినా ఇంత ఆలస్యంగా రీమేకులు చేస్తే ఇలానే అవుతుందేమో.
Gulte Telugu Telugu Political and Movie News Updates