Movie News

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా రిలీజైన ‘ప్రథమ దృష్ట్యా కుటక్కార్’ అదే జాబితాలో చేరేలా ఉంది. పాజిటివ్ రివ్యూలు ఎక్కువగా వస్తుండగా పబ్లిక్ టాక్ కూడా సానుకూలంగా కనిపిస్తోంది. షహాద్ దర్శకత్వం వహించిన ఈ కాప్ డ్రామాలో పార్వతి తిరువోతు ప్రధాన పాత్ర పోషించింది. ఈమె ఎవరు అంటే నాగ చైతన్య నటించిన వెబ్ సిరీస్ దూతలో డిసిపి క్రాంతిగా కనిపించిన నటి.

అంతగా ఇందులో ఏముందో ఒక లుక్ వేద్దాం. భర్తను పోగొట్టుకున్న అలీనా అనే మహిళకు పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం వస్తుంది. ఒక నిందితుడిని తీసుకొచ్చి బంధించిన క్రమంలో జరిగిన గొడవ వల్ల అతను చనిపోతాడు. దీంతో స్టేషన్ లో ఉన్న అలీనాతో పాటు మరో ముగ్గురు పెద్ద చిక్కులో ఇరుక్కుంటారు. సహజ మరణంగా చిత్రీకరించాలని పక్కా ప్లాన్ వేస్తారు. అయితే విచారణకు నియమించిన స్పెషల్ ఆఫీసర్ హారిస్ మీరన్ వచ్చాక సీన్ మారిపోతుంది. అక్కడి నుంచి అసలు ట్విస్టులు మొదలవుతాయి.

కేవలం లైన్ గా చదివితే గతంలో వచ్చిన వేరే మల్లువుడ్ క్రైమ్ సినిమాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా నాయట్టు రీమేక్ గా శ్రీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కోటబొమ్మాళి పీఎస్ ఇంచుమించు ఇదే బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. అయితే ప్రథమ దృష్ట్యా కుటక్కార్ బలమంతా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. హారిస్ కేసు చిక్కుముడి విప్పేకొద్దీ దాన్ని మరింత బిగుతుగా మార్చే అలీనా పాత్ర ద్వారా బోలెడు ట్విస్టులు పెట్టారు. వీళ్లిద్దరి మధ్య జరిగే ఇంటెలిజెంట్ గేమే అసలు హైలైట్ గా నిలుస్తుంది.

ఇంకో షాక్ ఏంటంటే హారిస్ ఒక అధికారిగా రాసిన పుస్తకాల ద్వారానే అలీనా ఎలా తప్పించుకోవాలని జ్ఞానం సంపాదించి ఉంటుంది. ఇప్పుడీ ప్రథమ దృష్ట్యా కుటక్కార్ బుకింగ్స్ పరంగా కేరళలో మంచి ట్రెండింగ్ లో ఉంటూ మందాడికి పోటీ ఇస్తోంది. మన దగ్గర తీస్తే ఇలాంటివి వర్కౌట్ కావు కానీ డబ్బింగ్ రూపంలో ఓటిటిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా భారీ వ్యూస్ తెచ్చుకుంటుంది. ఎటొచ్చి రీమేక్ లాంటి ప్రయత్నాలు చేయకపోతే బెటర్. అలాంటి క్యాస్టింగ్ సెట్ చేసుకోవడం కూడా కష్టమే.

This post was last modified on September 12, 2026 6:18 pm

Share

Recent Posts

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

1 hour ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

2 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

3 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

3 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

4 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

4 hours ago