విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా కష్టం అయిపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి వాళ్లకు మాత్రమే మినహాయింపు ఇవ్వొచ్చు కానీ మిగిలిన అందరిదీ ఇదే కథ. అలాంటిది కేవలం ముప్పై ఆరు రోజుల గ్యాప్ లో మూడు చిత్రాలు విడుదల చేయడానికి రెడీ కావడమంటే మాములు విశేషం కాదు. గత కొంత కాలంగా షూటింగ్స్ లోనే బిజీగా ఉన్న విశ్వక్ సేన్ దాన్ని చేసి చూపిస్తున్నాడు.

వీటిలో మొదటిది ‘కల్ట్’ అక్టోబర్ 30 రానుందని సమాచారం. స్వీయ దర్శకత్వంలో ఫుల్ వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో షాకింగ్ స్థాయిలో హింస ఉంటుందట. ప్రాజెక్ట్ లాంచ్ టీజర్ లోనే దీనికి సంబంధించిన శాంపిల్ చూపించిన సంగతి తెలిసిందే. రెండోది ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నవంబర్ 19 వస్తుంది. తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఈసారి రెట్టింపు వినోదంతో రెడీ అవుతోంది. అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

మూడోది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘లెగసీ’. సాయికిరణ్ రెడ్డి దర్శకుడు. ఇది డిసెంబర్ 4 రెడీ అవుతోంది. ఫౌజీ తప్పుకుంటుందని ముందుగానే పసిగట్టిన టీమ్ తెలివిగా డేట్ తీసేసుకుంది. నాగచైతన్య వృషకర్మ పోటీలో ఉన్నా రెడీ అవుతోంది. ఇక్కడ చెప్పిన మూడు విశ్వక్ సేన్ సినిమాల డేట్లలో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండబోవట. ఒకదానితో మరొకటి సంబంధం లేని జానర్లు కావడంతో విశ్వక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  

ఇది పైన చెప్పిన ప్రకారమే జరిగి ఆ తర్వాత విశ్వక్ సేన్ నుంచి పెద్ద గ్యాప్ రావొచ్చేమో. ప్రయోగం చేసిన లైలా,, గ్యారెంటీ హిట్ అనుకున్న ఫంకీ రెండు దారుణంగా దెబ్బేయడంతో సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న విశ్వక్ అన్నీ సాలిడ్ సబ్జెక్టులే ఎంచుకోవడం విశేషం. బయట ఈవెంట్లు వేడుకలకు రావడం బాగా తగ్గించేసిన ఈ యూత్ హీరో గట్టి హిట్టు కొట్టాకే తిరిగి హడావిడి చేసేలా ఉన్నాడు. మరి ఈ ట్రిపుల్ రిలీజుల్లో ఏది మేజర్ బ్రేక్ గా నిలుస్తుందో,  ఏది బ్లాక్ బస్టర్ అవుతుందో.