Movie News

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద హిట్టయిన సినిమా ‘డీసీ’. ఈ తమిళ చిత్రానికి తెలుగులో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ రన్లో వంద కోట్ల మేర వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచిందీ చిత్రం. పరిమిత బడ్జెట్లో రూపొందిన సినిమా ఇంత పెద్ద విజయం సాధించి అమితానందానికి గురైన ఈ చిత్ర నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్.. ‘డీసీ’ టీంలో ముఖ్యులకు లగ్జరీ కార్లు ప్రెజెంట్ చేశారు.

దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్‌తో పాటు హీరో లోకేష్ కనకరాజ్‌కు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు ఆయన బ్రాండ్ న్యూ బీఎం డబ్ల్యూ కార్లు ప్రెజెంట్ చేశారు. ఐతే ఆ ముగ్గురికీ కార్లు ఇవ్వడం బాగానే ఉంది కానీ.. ఈ సినిమాకు మరో మూల స్తంభంగా నిలిచిన హీరోయిన్ వామిక గబ్బికి కారు గిఫ్ట్ ఇవ్వకపోవడం సమంజసంగా అనిపించట్లేదు ఈ సినిమా అభిమానులకు.

‘డీసీ’కి నటన పరంగా అతి పెద్ద ఆకర్షణ వామికనే అనడంలో సందేహం లేదు. వేశ్య పాత్ర పోషించడానికి అందరూ అంగీకరించరు. ఒకవేళ అంగీకరించినా.. వామిక లాంటి కన్విన్సింగ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం అందరికీ సాధ్యం కాదు. నిజంగా ఒక అమ్మాయి బయటి ప్రపంచం తెలియకుండా వేశ్యాగృహంలో ఏళ్లతరబడి మగ్గిపోతే తన పరిస్థితి ఎలా ఉంటుందో.. తనెలా ప్రవర్తిస్తుందో.. అచ్చం అలాగే నటించి మెప్పించిందామె. 

కొన్ని సన్నివేశాల్లో తన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్పగా తన పాత్రను పోషించి సినిమాకు ప్రాణం పోసిన వామికకు గిఫ్ట్ ఇవ్వకపోవడం ఏంటంటూ సోషల్ మీడియా సన్ పిక్చర్స్ అధినేత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా పొరపాటు దిద్దుకుని వామిక ప్రతిభను గుర్తించాలని ‘డీసీ’ సినిమాతో తనకు ఫ్యాన్స్‌ అయిపోయిన నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on September 12, 2026 3:14 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago