ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ ఉంటుంది. ఐతే ఇప్పటికే దసరా మూవీతో దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకుని, ఇప్పుడు రూ.200 కోట్లకు పైగా బడ్జెట్లో ది ప్యారడైజ్ సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెలకు కూడా ఆ కోరిక ఉందట. రెండు సినిమాలు తీశాక అతను రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలనుకుంటున్నాడట. ఇందుకోసం నాని రెకమండేషన్ కూడా కోరాడట.
ఈ విషయాన్ని ప్యారడైజ్ లేటెస్ట్ ప్రెస్ మీట్లో నానినే స్వయంగా వెల్లడించాడు. మార్చిలోనే రిలీజ్ కావాల్సిన ప్యారడైజ్ రెండుసార్లు వాయిదా పడి సెప్టెంబరు 24న విడుదల కాబోతోంది. ఒక దశలో ఈ డేట్ కూడా మారుతుందనే ప్రచారం జరిగింది. షూటింగ్ అంతగా ఆలస్యం అయింది మరి. దీంతో శ్రీకాంత్ మీద విమర్శలు వచ్చాయి. ఐతే మేకింగ్ బాగా లేట్ చేయడం తన తప్పిదమే అనే విషయాన్ని శ్రీకాంత్ గుర్తించకుండా ఏమీ లేదని నాని తెలిపాడు.
టైమ్ మేనేజ్మెంట్ విషయంలో తన వైఫల్యం గురించి శ్రీకాంత్ తన దగ్గరికి వచ్చి సీరియస్‌గా మాట్లాడాడని, ఈ తప్పును సరి చేసుకోవడానికి రాజమౌళి దగ్గర పని చేయాలనుకుంటున్నట్లు చెప్పాడని నాని తెలిపాడు. తనకు రాజమౌళి క్లోజ్ కావడంతో ఇందుకోసం రెకమండ్ చేయాలని అడిగిన్లు నాని చెప్పాడు. ఎంత ప్రతిభ ఉన్న వాళ్లకైనా ఏదో ఒక లోపం ఉంటుందని.. శ్రీకాంత్‌కు టైమ్ మేనేజ్మెంట్ అన్నది సమస్య అని.. కానీ ఈ ఇబ్బందిని గుర్తించి నిజాయితీగా ఒప్పుకోవడం తనకెంతో నచ్చిందని, అతణ్నిచూసి తాను గర్విస్తున్నానని నాని అన్నాడు.
తన కెరీర్లో ఎన్నడూ లేనంత టైం ఈ సినిమాకు పట్టిందని, అది తనకు కూడా ఇబ్బందే అని.. కానీ ఈ నెల 24న ప్రేక్షకులకు ప్యారడైజ్ సినిమా నచ్చితే, తాము పెట్టిన ఎఫర్ట్ వాళ్లకు కనబడితే.. పడ్డ కష్టం, అయిన ఆలస్యం అంతా మరిచిపోతామని నాని అన్నాడు. ప్యారడైజ్ షూట్ ఇటీవలే పూర్తి కాగా.. ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ మోడ్‌లో ఉంది. 24న సినిమాను రిలీజ్ చేయాలంటే రేయింబవళ్లు పని చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ట్రైలర్ కట్ కోసం టైం పెట్టే పరిస్థితి లేక అది లేకుండానే సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
This post was last modified on September 11, 2026 11:50 pm
ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…
మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…
దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…
వైసీపీ అధినేత జగన్ నివాసం ఉండే తాడేపల్లి ప్రాంతం.. మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడ అనేక మంది పేదలు.. దిగువ…
రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలకు తమిళనాడు కేరాఫ్‌గా ఉంది. నాటి జయలలిత, కరుణానిధి ప్రభుత్వాల నుంచి నేటి…
తమిళంలో పేరున్న దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకరు. చెన్నై-28తో మొదలుపెట్టి చాలా హిట్లే ఇచ్చారు. చివరగా విజయ్ హీరోగా గ్రేటెస్ట్…