Movie News

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి రామ్ గోపాల్ వర్మ భూత్ వరకు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా విజయం సాధించినవి చాలా ఉన్నాయి. రవిబాబు అవును లాంటి వెరైటీ ప్రయోగాలు బాగానే ఆదరణ పొందాయి. అయితే లారెన్స్ ముని నుంచి హారర్ లోకి కామెడీ ప్రవేశించడంతో సీరియస్ దెయ్యాలకు ప్రాధాన్యం తగ్గడం మొదలయ్యింది. వైశాలి తర్వాత అంత డెప్త్ ఉన్న మూవీ రాలేదని చెప్పాలి.

గత కొన్ని వారాలుగా ఇండస్ట్రీ వర్గాల్లో బాగా చర్చలోకి వచ్చిన సినిమా 418. గత నెలే విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ సెన్సార్ ఇందులో ఉన్న హారర్ ఎలిమెంట్స్ కి భయపడి కట్స్ ఎక్కువ చెప్పారట. దాంతో రివైజింగ్ కమిటీకి వెళ్లి అడ్డంకులు దాటుకుని వచ్చి కొంత ఆలస్యంగా సెప్టెంబర్ 18 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ 418కి ప్రశాంత్ నీల్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించారు.

మూడున్నర నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. కథను దాచకుండా మెయిన్ పాయింట్ రివీల్ చేశారు. ఎక్కడో మారుమూల అడవిలాంటి ప్రాంతంలో ఒక విశాలమైన మూసేసిన భవంతిలో 418 రూమ్ ఉంటుంది. దాని జోలికి వెళ్తే ప్రాణాలు పోతాయని అందరి నమ్మకం. అలాంటి చోటికి హీరో ఫ్రెండ్స్ తో పాటు వెళ్తాడు. అయితే ఆ గదిలో ఒక అమ్మాయికి సంబంధించిన భయంకరమైన రహస్యం ఉంటుంది. దాన్ని తవ్వేకొద్దీ దారుణాలు, హత్యలు జరుగుతాయి.

లైన్ పరంగా చూస్తే మరీ కొత్తది కాదనిపిస్తుంది. కొన్ని నెలల క్రితం ప్రైమ్ లో కొంచెం దీనికి పోలిక అనిపించే వెబ్ సిరీస్ కూడా ఒకటి వచ్చింది. అయితే 418 ట్రీట్ మెంట్, ట్విస్టులు చాలా షాకింగ్ గా ఉంటాయట. అవి ట్రైలర్లో రివీల్ చేయలేరు కాబట్టి దాచి ఉంచారని అనుకోవాలి. బయట జరిగిన పబ్లిసిటీ ప్రకారం చూస్తే 418 మునుపెన్నడూ చూడని రేంజ్ లో భయపెట్టాలి. అది బిగ్ స్క్రీన్ కోసమే చూపించకుండా మేనేజ్ చేశారేమో. సిజి వెంకీ ఈ హారర్ డ్రామాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

This post was last modified on September 11, 2026 7:21 pm

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

27 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

55 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

1 hour ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago