Movie News

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్ మొదలుపెట్టినప్పటికీ హీరోగా యజ్ఞం ఇచ్చిన బ్రేక్ కొన్నేళ్ల పాటు స్టార్ డం అనుభవించేలా చేసింది. తర్వాత వరస ఫ్లాపులు మార్కెట్ ని తగ్గించుకుంటూ వెళ్లాయి. ఆ మధ్య పక్కా కమర్షియల్, రామబాణం, భీమా, విశ్వం అంటూ ఏవేవో చేశాడు కానీ పనవ్వలేదు. తనను స్క్రీన్ మీద చూసి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. బయట ఈవెంట్లు, ఫంక్షన్లలో కనిపించడం బాగా తగ్గిపోయింది.

ముందుగా చెప్పుకోవాల్సింది ప్యాన్ ఇండియా మూవీ భరతవర్ష గురించి. సుధాకర్ చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ గ్రాండియర్ కు ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ఏడో శతాబ్దంనాటి బ్యాక్ డ్రాప్ తీసుకుని చాలా పరిశోధన చేసిన తర్వాత స్క్రిప్ట్ లాక్ చేశారు. షూటింగ్ దాదాపుగా అయిపోతుందని వినిపించిన టైంలో టీజర్ వదిలారు. రెస్పాన్స్ బాగానే వచ్చింది. తర్వాత మళ్ళీ సౌండ్ లేదు. చూస్తుంటే 2026లో రిలీజయ్యే అవకాశాలు క్రమంగా తగ్గుతున్నాయి.

ఇదొక్కటే కాదు సింగ అని మరో సినిమాని మొన్న జూన్ లో అనౌన్స్ చేశారు. వి వెంకట్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. దీని అప్డేట్స్ కూడా ఆగిపోయాయి. సమస్య కేవలం చిత్రీకరణలో మాత్రమే లేదు. బడ్జెట్ పెరిగిపోవడం, ఓటిటి డీల్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడం, గోపీచంద్ థియేటర్ బిజినెస్ నెంబర్లు మునుపటిలా లేకపోవడం లాంటి ఎన్నో కారణాలు జాప్యానికి దారి తీస్తున్నాయి. ఆసక్తిని తగ్గిస్తున్నాయి.

ముందైతే గోపీచంద్ నుంచి సాలిడ్ గా ఒక బ్లాక్ బస్టర్ పడాలి. అది భరత వర్షతోనే సాధ్యమని అభిమానుల నమ్మకం. నిజానికి తన మీద ఇప్పటికీ మాస్ ఆడియన్స్ లో ఒకరకమైన గౌరవం ఉంది. సరైన కథ పడితే పైసా వసూల్ చేయిస్తాడనే నమ్మకం ఇప్పటికీ కనబరుస్తూ ఉంటారు. కాకపోతే బ్యాడ్ లక్ ఇలా ఫ్లాపులు ఇస్తూనే పోతోంది. వీలైనంత త్వరగా భరతవర్ష ప్రమోషన్లు మొదలుపెట్టి ఆ విడుదల తేదీ ఎప్పుడో అనౌన్స్ చేస్తే  ఫ్యాన్స్, మూవీ లవర్స్ కొంచెం రిలాక్స్ అవుతారు.

This post was last modified on September 11, 2026 7:54 am

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

2 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

2 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

3 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

5 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

5 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

5 hours ago