ఫౌజీ వాయిదా గురించి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా పోస్ట్ పోన్ ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. వచ్చిన సమాచారం విశ్వసనీయమైనది కావడంతో నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా మొత్తం పాకిపోయింది. దీన్ని ఖండిస్తూ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇన్ఫో లేకపోవడంతో అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం పడలేదు. అసలు ఎందుకు మళ్ళీ బ్రేక్ వేయాల్సిన అవసరం వచ్చిందనే ప్రశ్న జనాల మెదళ్లను తొలిచేస్తోంది.
అంతర్గతంగా వినిపిస్తున్న దాని ప్రకారం ఫౌజీ షూటింగ్ ఇంకొంచెం బాలన్స్ ఉంది. ఇంకో ఇరవై రోజుల దాకా షూట్ పెండింగ్ ఉండటం వల్ల హడావిడి పడటం ఇష్టం లేని దర్శకుడు హను రాఘవపూడి ఎక్కువ సమయం కోరారని వినికిడి. ఇద్దరు కీలక ఆర్టిస్టుల డేట్లు దొరక్కపోవడం మరో రీజనని వినిపిస్తోంది. ముంబై నుంచి రావాల్సిన వాళ్లకు ఇతర కమిట్ మెంట్లు ఉండటంతో ఫౌజీ బృందం కోరినప్పుడు రాలేకపోతున్నారట. ఇది కూడా ఆలస్యానికి దారి తీస్తోందని అంటున్నారు.
ప్రభాస్ వైపు నుంచి చూస్తే ఫౌజీ, స్పిరిట్ రెండూ సమాంతరంగా చేయాలని చూడటం ఇప్పుడీ పరిస్థితికి మరో కారణంగా చెప్పొచ్చు. అయితే మేకింగ్ లో జరిగిన విపరీతమైన జాప్యం, పదే పదే షెడ్యూల్స్ పొడిగించడం వల్లే వేరే ఆప్షన్ లేక డార్లింగ్ అటు స్పిరిట్ కి డేట్లు ఇవ్వాల్సి వచ్చిందని ప్రభాస్ సన్నిహిత వర్గాల మాట. పైగా దర్శకుడు హను పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ తాను కోరుకున్న క్వాలిటీలో వచ్చే వరకు కాంప్రోమైజ్ పడకపోవడం ఇక్కడి దాకా తెచ్చిందని అంటున్నారు.
సరే జరిగేదంతా మంచికే అనుకోవడం తప్ప ఇక్కడ చేయగలిగింది ఏమి లేదు. ఇమాన్వి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఫౌజీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. బ్రిటిషర్ల పాలనలో వ్యవస్థకు ఎదురు తిరిగిన ఒక బ్రాహ్మణ సైనికుడి కథగా దీన్ని తెరకెక్కిస్తున్నారు లవ్ స్టోరీతో పాటు యాక్షన్, ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయి. ఒకవేళ మార్చిలో రావాల్సిన స్పిరిట్ కనక నిర్ణయం మార్చుకోకుంటే 2027 వేసవి లేదా అంతకన్నా ఆలస్యం తప్ప ఫౌజీకి మరో ఆప్షన్ ఉండకపోవచ్చు.
This post was last modified on September 10, 2026 11:32 am
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…