కారణాలు లక్షా తొంభై ఉండని, టాలీవుడ్ హీరోలు చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. రవితేజ, శ్రీవిష్ణు లాంటి ఒకరిద్దరిని మినహాయించి అందరూ నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తున్నారు. గ్యాప్ తక్కువగా ఉంటే ఫ్లాపులు వస్తాయేమోనని భయం చాలా మందిలో ఉంది. అది నిజం కాదు. అలా అయితే సూర్య సంబంధం లేని జానర్లలో రెండు బ్లాక్ బస్టర్లు వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ కొట్టి చూపించాడు. మరో మూవీ సీన్ దీపావళి విడుదలకు వేగంగా రెడీ అవుతోంది.
సూర్యకు సాధ్యం అయినది మనకు ఎందుకు అసాధ్యం అనేది సీరియస్ గా వేసుకోవాల్సిన ప్రశ్న. ఇక్కడ సీనియర్ జూనియర్ అనే తేడా లేదు. చిరంజీవి భోళా శంకర్, మన శంకరవరప్రసాద్ గారు మధ్య రెండు సంవత్సరాలకు పైగా గ్యాప్ ఉంది. బాలయ్య అఖండ 2 వచ్చిన ఏడాది తర్వాత దాదా రిలీజ్ కు రెడీ అవుతోంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత స్పీడ్ పెంచలేదు. నాగార్జున స్పెషల్ రోల్స్ పక్కనపెడితే నా సామిరంగా తర్వాత ఆయన సోలో హీరోగా చేసింది కింగ్ 100 ఒకటే. ఇది డిసెంబర్ లో వస్తోంది.
వారణాసి కోసం మహేష్ బాబు, డ్రాగన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని త్యాగాలు చేస్తున్నారో చూస్తున్నాం. రామ్ చరణ్ కష్టం గేమ్ చేంజర్ బూడిదలో పోసిన పన్నీరు చేయగా పెద్ది తెలుగు రాష్ట్రాల వరకు హిట్ అనిపించుకుని గట్టెక్కింది. ప్రభాస్ రెస్టు లేకుండా ఒకేసారి రెండు మూడు ప్యాన్ ఇండియా మూవీస్ సెట్స్ మీద పెడుతున్నా కానీ రిలీజులు మాత్రం సంవత్సరానికి ఒకటే అవుతున్నాయి. నాని సైతం వీళ్ళ సరసన చేరిపోయి ది ప్యారడైజ్ కోసం టైం, కష్టం ఖర్చు చేశాడు.
ఇక అల్లు అర్జున్ సంగతి సరేసరి. పుష్ప కోసం అయిదేళ్ళు ఖర్చయ్యాయి. గొప్ప ఫలితం వచ్చింది సంతోషం. కానీ రాకా ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఆశించడానికి ఓజి 2 తప్ప ఏం లేదు. వీళ్ళే కాదు సిద్దు జొన్నలగడ్డ, సాయి దుర్గ తేజ్, గోపీచంద్, కళ్యాణ్ రామ్, శర్వానంద్, అడివి శేష్, నిఖిల్ సిద్దార్థ మొదలైనవాళ్లంతా స్లో అండ్ స్టడీ మంత్రం జపిస్తున్నారు. నితిన్ కొంత పర్వాలేదు కానీ వరస ఫ్లాపులు వెనక్కు లాగేశాయి. ఉన్నంతలో కిరణ్ అబ్బవరం కొంత నయమే కానీ తను కూడా దూకుడుగా లేడు. పట్టుమని అయిదు సినిమాలు లేని రోషన్ మేక కూడా ఇదే వరస. ఏమైనా తెలుగు హీరోలు స్పీడ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on September 10, 2026 11:14 am
దసరాని లక్ష్యంగా పెట్టుకుని విడుదలైన అయిదు సినిమాల్లో నాలుగు తమ టార్గెట్ ని దాదాపుగా అందుకునే పనిలో ఉండగా ఒకటి…
ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు…
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. పుంగనూరు, పులివెందుల, కడప, రాయచోటి…
మైత్రి మూవీ మేకర్స్, ప్రశాంత్ నీల్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. అయితే ఈ ఇద్దరూ…
సాయిదుర్గ తేజ్ గత రెండేళ్లకు పైగా అంకితమైపోయిన సంబరాల ఏటిగట్టు గతంలో ప్రకటించిన దాని ప్రకారం జనవరి 12 వచ్చేయాలి.…
ఇంకో పధ్నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.…