Movie News

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్లు కొడుతున్న తీరు చూసి ఇతర కోలీవుడ్ హీరోలు ఈర్ష్యతో రగిలిపోతున్నారంటే అందులో న్యాయముందనే చెప్పాలి. వీరభద్రుడు అలియాస్ కరుప్పు ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేయగా తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు వందల కోట్లకు దగ్గరగా వెళ్లి ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది. ఇంకా పలుచోట్ల ఆడుతూనే ఉంది.

అంటే ఇప్పటిదాకా రెండు సినిమాలతో సూర్య సాధించిన గ్రాస్ అయిదు వందల కోట్లు దాటేసింది. నెక్స్ట్ సినిమా సీన్ కూడా నవంబర్ 6 విడుదలకు రెడీ అవుతోంది. ఫహద్ ఫాసిల్ తో ఆవేశం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పోలీస్ డ్రామా టీజర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పేరుకి డిఎస్పి అయినప్పటికీ విచిత్రమైన క్యారెక్టరైజేషన్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చూపించిన తీరు టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది.

యునిఫార్మ్ వేసుకోకుండా షార్ట్, టి షర్ట్ వేసుకుని జైల్లో, డిపార్ట్ మెంట్ లో ఒక్కొక్కరు తన గురించి విచిత్రంగా ఆలోచించేలా చేసుకునే ఒక పోలీస్ ఆఫీసర్ కథే ఈ సీన్. టీజర్ చిన్నదే అయినా ఇంపాక్ట్ పెద్దదే కనిపిస్తోంది. నజ్రియా హీరోయిన్ గా నటించిన ఈ కాప్ డ్రామాలో క్రైమ్, కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయట. సుషిన్ శ్యామ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఫ్రెష్, డిఫరెంట్ గా అనిపించింది. ప్రేమలు, లోకా ఫేమ్ నస్లేన్ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

అసలు విశేషం మరొకటి ఉంది. సూర్య సీన్ ఏకంగా రామాయణతో క్లాష్ అవుతోంది. దీపావళి పండగని టార్గెట్ చేసుకున్న సీన్ ఎదురుగా ఎవరు ఉన్నా పట్టించుకునేలా లేదు. ఎంత ప్యాన్ ఇండియా మూవీ అయినా రామాయణ మీద బజ్ మిశ్రమంగా ఉంది కాబట్టి పోటీకి వచ్చి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ఆలోచనలో పలువురు హీరోలున్నారు. సూర్య ముందు కర్చీఫ్ వేశాడు. ఇది కూడా విజయం సాధిస్తే మూడు రెండు వందల కోట్ల సినిమాలు ఒకే ఏడాదిలో ఇచ్చిన ఘనత సూర్యకు దక్కుతుంది.  

This post was last modified on September 9, 2026 11:09 pm

Share

Recent Posts

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

44 minutes ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

2 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

2 hours ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

2 hours ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

3 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

3 hours ago