‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు సినిమాలోనే కాదు.. మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ప్రకంపనలు రేపింది సందీప్ రెడ్డి వంగ, విజయ్ దేవరకొండ జోడీ. అలాంటి పాత్ బ్రేకింగ్, ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ దశాబ్దానికి ఒక్కటి కూడా రావు. ఈ సినిమా తర్వాత ఇటు వంగ.. అటు విజయ్‌ల రేంజ్ మారిపోయింది. దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు. చాలా పెద్ద స్థాయికి వెళ్లిపోయారు. ఐతే మళ్లీ ఈ కలయికలో అభిమానులు సినిమా ఆశిస్తున్నా.. ఎవరి కమిట్మెంట్లతో వాళ్లు బిజీ అయిపోవడంతో కాంబినేషన్ కుదరడం లేదు.
కానీ మళ్లీ కలిసి సినిమా చేయకపోయినా.. ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం అలాగే ఉందని ఎప్ప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. తాజాగా ఈ ఇద్దరూ ఒకరి ఫ్యామిలీ సినిమాను ఇంకొకరు ప్రమోట్ చేసుకున్నారు. సందీప్ అన్న ప్రణయ్ నిర్మించిన ‘రోమాంచకం’ మూవీ ఈవెంట్‌కు విజయ్ అతిథిగా వస్తే.. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చిత్రం ‘ఎపిక్’ మూవీ వేడుకకు సందీప్ గెస్ట్‌గా వచ్చాడు.
నిన్న జరిగిన ‘ఎపిక్’ ఈవెంట్‌లో సందీప్ ఎంతో సరదాగా, హుషారుగా కనిపించాడు. ఈ వేడుకకు వచ్చినందుకు విజయ్.. తన మిత్రుడికి ఒక రిస్ట్ వాచ్ గిఫ్ట్‌గా ఇవ్వడం, దాన్ని అక్కడిక్కడ సందీప్ చేతికి పెట్టేసుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. స్టేజ్ ఎక్కడానికి ముందు విజయ్, సందీప్ పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా విజయ్.. తాను గిఫ్ట్‌గా తీసుకొచ్చిన వాచీని సందీప్‌కు ఇచ్చాడు.
అతను ఆలస్యం చేయకుండా దాన్ని చేతికి కట్టుకుని విజయ్‌తో సంభాషణను కొనసాగించాడు. ఇదంతా చాలా క్యాజువల్‌గా జరిగిపోయింది. ఈ ఇద్దరి మధ్య స్నేహానికి ప్రతీకగా నిలిచిన ఈ దృశ్యం సోషల్ మీడియా దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. విజయ్, సందీప్ మళ్లీ కలిసి సినిమా చేయకపోయినా.. వీరి కలయికలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు వచ్చే ఏడాది పదేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఎక్స్‌టెండెడ్ వెర్షన్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates