Movie News

రావణుడితో కాదు గాడ్జిల్లాతో యుద్ధం చేయాలి

అదేంటి రాముడు యుద్ధం చేయాల్సింది రావణుడితో కదా, మరి గాడ్జిల్లాతో ఏంటని ఆశ్చర్యపోకండి. విషయం వేరే ఉంది. నవంబర్ 6 విడుదల కాబోతున్న రామాయణకి పోటీగా గాడ్జిల్లా మైనస్ జీరో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. నిన్న టీజర అంచనాలు పెరిగిపోయాయి. కేవలం నిమిషంన్నర వీడియోకే  ఆడియన్స్ ఊగిపోతున్నారు. ఐమాక్స్ టెక్నాలజీకి అనుగుణంగా రూపొందిన ఈ మాన్స్ టర్ థ్రిల్లర్ బడ్జెట్ మొదటి భాగం కన్నా అయిదింతలు పెంచారట.

ఇప్పుడు సమస్య ఏమిటంటే నవంబర్ 6 రామాయణ వస్తోంది. నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న ఈ ఎపిక్ గ్రాండియర్ కూడా ఐమాక్స్ సాంకేతికతలో తీశారు. ఓవర్సీస్ లో భారీ రిలీజ్ దక్కాలంటే ఈ తెరలను వీలైనంత బుక్ చేసుకోవాలి. కానీ గాడ్జిల్లా మైనస్ జీరో వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని డిస్ట్రిబ్యూటర్ వర్గాల టాక్. ముఖ్యంగా యుఎస్, యుకె, జపాన్ తదితర దేశాల్లో స్క్రీన్లను దక్కించుకోవడం పెద్ద ఛాలెంజ్ అవుతుందని జోస్యం చెబుతున్నారు.

సానుకూల విషయం ఏమిటంటే రామాయణ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నది సోనీ సంస్థ కాబట్టి పరిస్థితి మరీ దారుణంగా ఉండకపోవచ్చు. స్క్రీన్ కౌంట్ సంగతి కాసేపు పక్కనపెడితే గాడ్జిల్లా మైనస్ జీరో మీద పిల్లలు, యువత బాగా ఆసక్తి చూపిస్తారు. వాళ్ళను రామాయణ వైపు లాగడం అంత ఈజీ కాదు. పైగా ట్రైలర్ బానే ఉన్నప్పటికీ అన్ని వర్గాల నుంచి యునానిమస్ అనిపించుకోలేదు. సో ఇంకా టెర్రిఫిక్ అనిపించే కంటెంట్ ఏదైనా క్రమం తప్పకుండా వదులుతూ ఉండాలి.

ఇప్పటికైతే రామాయణ టీమ్ పబ్లిసిటీ పర్వం పూర్తి స్థాయిలో మొదలుపెట్టలేదు. టాక్సిక్ దారుణంగా పోవడంతో యష్ రిలీఫ్ కోసం ఫారిన్ ట్రిప్ వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే రావణుడిగా తాను పడిన కష్టం గురించి ప్రమోషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రచారాన్ని వేగవంతం చేసేందుకు నిర్మాత నమిత్ మల్హోత్రా ఏర్పాట్లు చేస్తున్నారట. దర్శకుడు నితేశ్ తివారి దగ్గరుండి చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఫైనల్ కాపీ ఈ నెలాఖరుకు సిద్ధం కావొచ్చట. 

This post was last modified on September 9, 2026 10:41 am

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

4 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

4 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

5 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

7 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

7 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

7 hours ago