Movie News

ఓటీటీలతో ఆటలు బహు ప్రమాదకరం

కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా ఊహించని రేట్లు ఇచ్చి నిర్మాతలను సంబరాల్లో ముంచెత్తాయి స్ట్రీమింగ్ సంస్థలు. సినిమాలకు కొత్తగా పెద్ద స్థాయిలో డిజిటల్ మార్కెట్ ఓపెన్ కావడంతో నిర్మాతలు బడ్జెట్లు పెంచేశారు. హీరోలు పారితోషకాలనూ పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు చూస్తేనేమో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ప్లేటు ఫిరాయించేస్తున్నాయి.

సినిమాకు డిజిటల్ రైట్స్ అమ్ముడవడం పెద్ద సమస్యగా మారిపోతోంది. నిర్మాతలు కోరుకున్న రేట్లు రావడం లేదు. ఒకసారి రేటు ఫిక్స్ చేశాక కూడా.. అనేక కండిషన్లు పెడుతున్నాయి. థియేటర్లలో సినిమా సరిగా ఆడకపోతే, ఓటీటీలో వ్యూస్ తగ్గిపోతే.. రేట్లు తగ్గించేస్తున్నారు. అంతే కాక వాళ్లు చెప్పిన డేటుకే సినిమాలను రిలీజ్ చేయాలంటున్నాయి. తమ స్లాట్‌గా అనుగుణంగానే థియేట్రికల్ రిలీజ్ ఉండాలంటున్నాయి. డెడ్ లైన్లను అందుకోకుంటే రేట్లు తగ్గించేస్తున్నాయి. ఇలా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌తో నిర్మాతల పాట్లు అన్నీ ఇన్నీ కావు.

టాక్సిక్ సినిమాకు ఒక ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రిలీజ్‌కు ముందు రూ.150 కోట్లు ఆఫర్ చేసినా నిర్మాణ సంస్థ ఓకే చెప్పలేదట. ఇంకా ఎక్కువ డిమాండ్ చేయగా.. ఇప్పుడు థియేటర్లలో ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ముందు ఆఫర్ చేసిన దాంట్లో నాలుగో వంతు కంటే తక్కువకు అడుగుతున్నారంటూ ఒక వార్త హల్‌‌చల్ చేస్తోంది.
‘పెద్ది’ సినిమాకు ముందు ఒక రేటు ఫిక్స్ చేసి.. ఆ చిత్రం అండర్ పెర్ఫామ్ చేసిన నేపథ్యంలో రిలీజ్ తర్వాత తగ్గించి ఇచ్చారట.

మరోవైపు ‘ది ప్యారడైజ్’, ‘ఫౌజి’ సహా పలు చిత్రాల మేకర్స్ కిందా మీదా పడి రేయింబవళ్లు షూటింగ్స్ చేస్తుండడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఒత్తిడే కారణమని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ డేట్లు దాటితే డిజిటల్ హక్కుల రేట్లు తగ్గించేస్తారట. ఇలాంటి కండిషన్లు పెట్టడం.. డీల్స్ రివైజ్ చేయడం.. అడిగిన రేట్లు ఇవ్వకపోవడం.. ఫిక్స్ చేసిన రేట్లను తగ్గించడం.. ఇలా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ విన్యాసాలు మామూలుగా లేవని నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

This post was last modified on September 9, 2026 10:27 am

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

36 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

42 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

53 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

6 hours ago