Movie News

ఫేక్ కలెక్షన్లపై వంగ బ్రదర్ పంచ్‌లు

చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేదు. ఈ రోజుల్లో ఒరిజినల్ కలెక్షన్లను పెంచి పోస్టర్లు వేయడం మామూలైపోయింది. ఎవ్వరూ ఆ నంబర్లను నమ్మట్లేదని తెలిసినా నిర్మాతలు మారట్లేదు. తాము ప్రకటించే కలెక్షన్లు ఒరిజినల్ కాదని స్వయంగా చెబుతూ.. అభిమానుల కోసమే ఇదంతా అంటూనే అవే ఫేక్ పోస్టర్లు దించుతూనే ఉన్నారు. ఈ ప్రాక్టీస్ మంచిది కాదని, మానుకోవాలని అనేవాళ్లు కూడా అందులో భాగం అవుతూనే ఉన్నారు.

ఈ ఒరవడిపై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తన ప్రొడక్షన్లో వచ్చిన కొత్త సినిమా ‘రోమాంచకం’ సక్సెస్ మీట్లో కొంచెం ఘాటు వ్యాఖ్యలే చేశాడు. టాలీవుడ్లో కలెక్షన్లు పెంచి చూపించడం చాలా మామూలు వ్యవహారం అయిపోయిందని, ఇది మంచిది కాదని ప్రణయ్ అన్నాడు.

ఉన్నదాని కంటే ఎక్కువ కలెక్షన్లు చూపించి ప్రచారం చేసుకోవడం వల్ల నిర్మాణ సంస్థకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చని.. కానీ అందులో భాగమైన నటీనటులు, టెక్నీషియన్లు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడతారని.. వారి మార్కెట్ మీద అది ప్రభావం చూపిస్తుందని ప్రణయ్ అభిప్రాయపడ్డాడు. సినిమాను మార్కెట్ చేసుకోవడం కోసం అబద్ధపు నంబర్లు చెప్పి ప్రచారం చేసినా.. ఒరిజినల్ ఫిగర్స్ ప్రొడక్షన్ హౌస్‌ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయని ప్రణయ్ అన్నాడు. తమ సినిమా ‘రోమాంచకం’ విషయంలో మాత్రం తాము తప్పుడు నంబర్లు వేయలేదని ప్రణయ్ స్పష్టం చేశాడు.

ఈ సినిమా నాలుగున్నర రోజుల్లో రూ.8.5 కోట్లు కలెక్ట్ చేసిందని ప్రణయ్ తెలిపాడు. ఇందులో ఎంతమాత్రం ఫేక్ లేదని.. ఈ నంబర్లనే అఫీషియల్ పోస్టర్ల మీద కూడా వేస్తున్నామని.. బాక్సాఫీస్ ట్రాకింగ్ వెబ్ సైట్లలో కూడా ఇవే వివరాలు చూసుకోవచ్చని ప్రణయ్ తెలిపాడు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా వేణుగోపాల్ రెడ్డి రూపొందించిన ‘రోమాంచకం’ గత గురువారం రిలీజై మోడరేట్ రివ్యూలు తెచ్చుకున్నప్పటికీ.. వసూళ్ల పరంగా బాగానే పెర్ఫామ్ చేస్తోంది.

This post was last modified on September 7, 2026 5:18 pm

Share

Recent Posts

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

21 minutes ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

1 hour ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

1 hour ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

2 hours ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago