బుధవారం ప్రీమియర్లతో విడుదలైన రోమాంచకం కు మొదటి రోజు ఆశించిన స్థాయిలో యునానిమస్ టాక్ రాలేదు. నవ్వించారు, హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసిన కామెడీ పేలిందనే కామెంట్స్ బాగా వచ్చాయి కానీ అసలైన హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, ఎమోషన్స్ గురించి గొప్పగా ఎవరూ చెప్పలేదు. రివ్యూలు కూడా మిక్స్డ్ గా రావడంతో టీమ్ కొంచెం ఖంగారు పడి ఉంటుంది. అయితే శని ఆదివారాల వీకెండ్ రోమాంచకంకు కొంచెం ప్లస్ అయినట్టుగా బుక్ మై షో నెంబర్లు చెబుతున్నాయి.
గత ఇరవై నాలుగు గంటల్లో సుమారు 24 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. నిజానికిది తక్కువ నెంబరే. అయితే యూత్ ని టార్గెట్ చేసుకున్న మూవీకి డీసెంట్ అని చెప్పొచ్చు. ఈ ఆనందాన్ని నిర్మాత సందీప్ వంగ, ప్రణయ్ వంగ సెలెబ్రేట్ చేసుకుంటూ నిన్న సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టారు. ఒకవేళ కంటెంట్ ఇంకొంచెం బలంగా ఉండి, ఎమోషన్స్ సరైన రీతిలో రిజిస్టర్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్లేదనే కామెంట్ లో నూటికి నూరు శాతం నిజం ఉంది.
ఇక్కడ వంగ బ్రదర్స్ కు ఊరట కలిగించే విషయం ఏమిటంటే రోమాంచకంకు బ్యాడ్ మూవీ అనో లేదా అస్సలు బాలేదనో ముద్ర పడలేదు. ఎలాంటి ఏ సర్టిఫికెట్ సన్నివేశాలు లేకుండా ఒక క్లీన్ ఎంటర్ టైనర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే రైటింగ్, టేకింగ్ లోని కొన్ని లోపాలు పూర్తి పొటెన్షియాలిటీని వాడుకోనివ్వకుండా బ్రేక్ వేశాయి. అందులోనూ మీర్జాపూర్, రంభ ఊర్వశి మేనక, బెత్లెహాం కుటుంబ యూనిట్, ఇరుముడి రూపంలో ఉన్న పోటీ వసూళ్ల మీద ప్రభావం చూపించింది.
ఇంకో వీకెండ్ ఇదే స్పందన ఉంటుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే సెప్టెంబర్ 10, 11 తేదీల్లో మంచి కంటెంట్స్ ఉన్న రిలీజులు నాలుగైదు వస్తున్నాయి. ఆటోమేటిక్ గా జనాల అటెన్షన్ అటువైపు వెళ్ళిపోతుంది. సో ఈ వీక్ డేస్ రోమాంచకంకు కీలకం కాబోతున్నాయి. గోదారి గట్టుపైన కంటే సుమంత్ ప్రభాస్ కు ఇది బెటర్ మూవీగా నిలుస్తుందా లేక దాని సరసన నిలుస్తుందా అనేది ఫైనల్ రన్ అయ్యాక తేలుతుంది. బ్రేక్ ఈవెన్ అయితే కాస్త దూరంలోనే ఉంది మరి.
And that’s #SandeepReddyVanga’s way of celebrating ❤️🔥❤️🔥❤️🔥
— Bhadrakali Pictures (@VangaPictures) September 6, 2026
Cheers to the laughs, the love and everything #Romanchakam is bringing 🥂
Highly #Spirit-ed, as always. ❤️ pic.twitter.com/bsfG49UwzP
Gulte Telugu Telugu Political and Movie News Updates