Movie News

దాదా రియాక్షన్లు తేడాగా ఉన్నాయా

నిన్న విడుదలైన బాలయ్య ‘దాదా’ టైటిల్ వీడియో టీజర్ మీద సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్లు కనిపిస్తున్నాయి. ఓజి షేడ్స్ ఉన్నాయని కొందరు కామెంట్ చేశారు. ఇదే గోపీచంద్ మలినేని తీసిన సన్నీడియోల్ జాట్ లోని పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ చేశారని ఇంకొందరు గుర్తు చేశారు. పూరి జగన్నాథ్ తీసిన పైసా వసూల్ పోలికలున్నాయని ఇంకో వర్గం అంటోంది. సాయిమాధవ్ బుర్రా డైలాగులు మరీ 90స్ స్టయిల్ లో పాత తరహాలో ఉన్నాయని ఇంకొందరు అన్నారు.

ఒకరకంగా చెప్పాలంటే ఎక్స్, ఇన్స్ టాని ఊపేయాల్సిన దాదా తన మీద పెట్టుకున్న అంచనాలను పూర్తి స్థాయిలో పెంచలేకపోయాడనే ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి దర్శకుడు గోపిచంద్ మలినేని ఇది బాలయ్య కోసం ముందుగా అనుకున్న కథ కాదు. పీరియాడిక్ ప్రాజెక్టు డ్రాప్ అయ్యాక అప్పటికప్పుడు ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని రెడీ చేసుకున్నారు. ఓజి ప్రభావం ఇంకా జనం మెదళ్లలో ఫ్రెష్ గా ఉన్న టైంలో తక్కువ గ్యాప్ తో దాదా రావడంతో పోలికలు సహజంగానే వస్తాయి.

డిసెంబర్ 24 విడుదల కాబోతున్న దాదాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద కూడా మిశ్రమ స్పందనే ఉంది. బీట్స్ కొత్తగా లేవని, కొంచెం రిపీట్ అనిపిస్తోందని అంటున్న వాళ్ళు లేకపోలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే దాదా మంచి పోటీలో దిగుతున్నాడు. ఒకవైపు నాగార్జున కింగ్ 100, ఇంకోపక్క షారుఖ్ ఖాన్ కింగ్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాయి. వీటికి ధీటుగా దాదా నిలవాలంటే అఖండ, భగవంత్ కేసరి స్థాయిలో టాక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.

యూనిట్ చెబుతున్న దాని ప్రకారం చూస్తే టైటిల్ టీజర్ కేవలం రెండు మూడు సన్నివేశాలను తీసుకుని కట్ చేశారని, అసలు కంటెంట్ వేరే లెవెల్ లో ఉంటుందని, ముఖ్యంగా బాలయ్య క్యారెక్టరైజేషన్, కథలో మలుపులు కొత్త అనుభూతి ఇస్తాయని అంటున్నారు. రీ రికార్డింగ్ అయ్యాక తమన్ పనితనం తెలుస్తుందని అంటున్నారు. సో ఇంతగా చెబుతున్నారంటే మ్యాటర్ ఏదో బలంగానే నిలిచేలా ఉంది. దసరా పండక్కు మొదటి పాట విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట.

This post was last modified on September 7, 2026 9:59 am

Share

Recent Posts

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

1 minute ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

48 minutes ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

2 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

2 hours ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

2 hours ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

3 hours ago