Movie News

హిందీ రిస్కు వద్దనుకోవడమే మంచిదా?

నాని కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 లేదా 9 కి వెళ్లిపోయిందనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లో తెగ తిరుగుతున్నాయి. యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా జరుగుతున్న ప్రచారాన్ని కనీసం ఖండించకపోవడంతో పోస్ట్ పోన్ తప్పదనే క్లారిటీ వచ్చేసినట్టే. ఇంకొక పాటతో పాటు ప్యాచ్ వర్క్ సీన్లు పెండింగ్ ఉండటమే దీనికి కారణమంటున్నారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఫాస్ట్ గా అవ్వకపోవచ్చట.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్యారడైజ్ హిందీ వెర్షన్ విడుదల సమాంతరంగా ఉండకపోవచ్చని వినిపిస్తోంది. అదే నిజమైతే మంచి నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం  తెలుగు డబ్బింగ్ వెర్షన్లు బాలీవుడ్ లో అంతగా వర్కౌట్ కావడం లేదు. ఎంత ప్రమోషన్లు చేసినా కనీస బజ్ లేకపోతే ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి ఒకరిద్దరు మినహాయింపుగా నిలుస్తున్నారు తప్పించి మిగిలిన వాళ్లకు వృథా ప్రయాస మిగులుతోంది.

రామ్ చరణ్ అంత కష్టపడి ఢిల్లీ ముంబై వెళ్ళొస్తే పెద్దిని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కంటెంట్ కొంచెం కారణం అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ బ్రాండింగ్ అక్కడ ఉపయోగపడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. నాని హిట్ 3, దసరా కోసం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా నార్త్ లో పనవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్యారడైజ్ ని మన దగ్గర ఫలితాన్ని బట్టి తక్కువ గ్యాప్ లో రిలీజ్ చేసుకోవడం మంచి నిర్ణయం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది.

ఉత్తరాది మల్టీప్లెక్సులు ఎనిమిది వారాల ఓటిటి అగ్రిమెంట్లు లేకపోతే షోలు ఇవ్వవు. మన నిర్మాతలు తెలివిగా ఒరిజినల్ ప్లస్ సౌత్ భాషల అనువాదాలు ఇరవై ఎనిమిది రోజుల స్ట్రీమింగ్ కి ఇచ్చేసి హిందీ మాత్రం తరవాత అన్నట్టు ఒప్పందం చేసుకునేవారు. కొన్ని సార్లు మల్టీప్లెక్సులు ఒప్పుకోకపోతే సింగల్ స్క్రీన్లతో సరిపెట్టాల్సి వచ్చేది. ఈ గోలంతా పడటం కంటే చక్కగా ఏపీ తెలంగాణతో పాటు ఓవర్సీస్ రిలీజ్ మీద దృష్టి పెట్టడం ఉత్తమం. ఇంతకీ ప్యారడైజ్ కొత్త డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో. 

This post was last modified on September 6, 2026 9:30 am

Share

Recent Posts

పాపం.. గీత మాత్రం ఏం చేస్తారు.. ప‌వ‌న్ ఇలా చేస్తార‌నుకోలేదా..!

పాపం గీత -  పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. రాజ‌కీయంగా ఆమె ఇక్క‌డ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త…

3 hours ago

మోహ‌న్ లాల్ సినిమాకు అధికార పార్టీ ఫండింగ్?

అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు త‌మ‌కు అనుకూలంగా, త‌మ ఐడియాల‌జీకి అనుగుణంగా సినిమాలు తీయించుకోవ‌డం కొత్తేమీ కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న…

3 hours ago

సినిమాపై ధీమానా… ప్ర‌భాస్ రాడ‌న్న ధైర్య‌మా?

ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. దానికి పోటీగా వేరే సినిమాను రిలీజ్…

7 hours ago

తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద టైటిల్

తెలుగులో అసలే పేరే లేకుండా రిలీజైన సినిమా ఒకటుంది. జేడీ చక్రవర్తి నటించిన ఆ చిత్రానికి రిలీజ్ తర్వాత ‘పాపే…

8 hours ago

కలుషిత నదిలోకి దిగి… ఒంటరిగా ప్రక్షాళన

ఈత రాదు.. చేతులకు గ్లౌజులు లేవు.. కాళ్లకు బూట్లు కూడా లేవు. అయినా నదిలోకి దిగాడు. ప్లాస్టిక్‌, చెత్తతో కలుషితమైన…

11 hours ago

ఇదేం ట్విస్ట్… చెప్పిన డేటుకే ఆద‌ర్శ కుటుంబం

ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సినిమా మొద‌ట ప్ర‌క‌టించిన డేటుకు రిలీజైతే ఆశ్చ‌ర్య‌పోయే ప‌రిస్థితి ఉంటోంది. ఎంత ప్రణాళికాబ‌ద్ధంగా షూటింగ్…

11 hours ago