Movie News

గూఢచారి-2కి వేరే దర్శకుని ఎలివేషన్

బహుముఖ ప్రజ్ఞాశాలి అడివి శేష్ నుంచి ఒక సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో దానిపై మంచి అంచనాలుంటాయి. ఈ వేసవిలో ‘డెకాయిట్’ సినిమాతో పలకరించిన శేష్.. అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయాడు. అది ఒక మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది. ఐతే ఇప్పుడు శేష్ నుంచి రాబోతున్న ‘గూఢచారి-2’ మాత్రం నిరాశపరచదనే అభిమానులు ఆశిస్తున్నారు. శేష్ కెరీర్లో అతి పెద్ద హిట్‌గా నిలిచిన ‘గూఢచారి’కి ఇది సీక్వెల్.

శేష్ స్వయంగా స్క్రిప్టు అందించిన ఈ చిత్రాన్ని.. విజయ్ కుమార్ సింగినీడి రూపొందిస్తున్నాడు. ఎప్పట్లాగే ఈ శేష్ సినిమాకు కూడా రైటింగ్, మేకింగ్ విషయంలో చాలా టైమే పట్టింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉండగా.. ఈ ఏడాది చివర్లో, లేదా వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్లో దీన్ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇంకా ఫస్ట్ కాపీ తీయకముందే శేష్ మిత్రుడు, నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ‘గూఢచారి-2’ చూసేశాడట. చూడగానే చాలా ఎగ్జైట్ అవుతూ సోషల్ మీడియాలో ఆ సినిమాకు ఎలివేషన్ ఇస్తూ పోస్టు పెట్టాడు రాహుల్.

శేష్ సినిమాలు 90 శాతం పూర్తయ్యాక తనకు చూపిస్తాడని.. గూఢచారి-2ను మాత్రం 70 శాతం పూర్తయిన దశలో తనకు చూపించాడని రాహుల్ తెలిపాడు. ఎడిట్ వెర్షన్ చూసి షాకైపోయానని.. ఇందులో విజువల్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయని రాహుల్ తెలిపాడు. ఈ ఇండియన్ స్పై థ్రిల్లర్.. కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని.. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ముఖ్యంగా ట్విస్టులు వేరే లెవెల్లో ఉంటాయని.. ఈ సినిమా రిలీజైనపుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని రాహుల్ చెప్పాడు.

ఈ సినిమాకు కాస్టింగ్ పరంగా ఆకర్షణలు బాగానే ఉన్నాయి.
‘డీసీ’తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన వామికా గబ్బి అంతకంటే ముందే ‘జీ-2’లో కథానాయికగా ఎంపికైంది. ఆమె వల్ల సినిమాకు క్రేజ్ ఇంకా పెరుగుతుందనడంలో సందేహం లేదు. అలాగే ‘ఓజీ’తో తెలుగు ప్రేక్షకులకు చేరువై, ‘ఆవారాపన్-2’తో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఇమ్రాన్ హష్మి ఇందులో విలన్ పాత్ర చేస్తుండడం విశేషం. కాబట్టి సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే వేరే లెవెల్‌కు వెళ్లడం ఖాయం. ఈ చిత్రాన్ని రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌లో రూపొందిస్తున్నారు.

This post was last modified on September 5, 2026 10:20 pm

Share

Recent Posts

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

46 minutes ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

2 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

4 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

5 hours ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

5 hours ago