Movie News

ప్రభాస్ ఓడిన జానర్లో రవితేజ గెలవాలి

ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయాన్ని మనసారా ఆస్వాదిస్తున్న రవితేజ తన అభిమానుల ఏళ్ళ తరబడి ఆకలిని ఒకేసారి తీర్చేశాడు. హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో సక్సెస్ కావడం చూసి ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. కేవలం అయిదు రోజుల గ్యాప్ లో టాక్సిక్ వస్తుందని వాళ్ళు కొంచెం ఖంగారు పడినా దాని ప్రతికూల ఫలితం ఇరుముడికి ఇంకా ప్లస్ అయ్యింది. రెండు వారాలు దాటుతున్నా చాలా చోట్ల హాలిడే వస్తే చాలు టికెట్లు దొరకడం లేదు.

ఇదిలా ఉండగా రవితేజ నెక్స్ట్ ఎవరితో చేస్తారనే దాని మీద దాదాపు క్లారిటీ వచ్చేసింది. శ్రీవిష్ణు కాంబోతో హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే ఎంటర్ టైనర్ కు కొంచెం బ్రేక్ ఇచ్చారని ఫిలిం నగర్ టాక్ జోరుగా ఉన్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ ఇంకా పక్కాగా రూపొందాలట. దీనికన్నా ముందు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో లక్ష్మణ్ నిర్మించబోయే భారీ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

మెయిన్ పాయింట్ ఏంటంటే వివేక్ ఆత్రేయ రాసుకున్న బ్యాక్ డ్రాప్ హారర్ టచ్ తో ఉంటుందట. స్పష్టంగా వివరించాలంటే సరిపోదా శనివారం థ్రిల్, క్రాక్ యాక్షన్, కిక్ కామెడీ మూడు కలిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని వినికిడి. ఇంకా చెప్పాలంటే రాజా సాబ్ తో ఏదైతే ప్రభాస్ పోగొట్టుకుని ఓడిపోయాడో ఇప్పుడు అదే జానర్ లో రవితేజ గెలిచి చూపించాలి. ఊహించని విధంగా స్క్రిప్ట్ ఆ స్థాయిలో అయితే వచ్చిందట. అందుకే ముందుగా స్టార్ట్ చేస్తారని టాక్.

ఈ లెక్కన 2027 సంక్రాంతికి రవితేజ రిలీజ్ ఏదీ ఉండకపోవచ్చు. ఇంకో నాలుగు నెలలే ఉంది కాబట్టి ఇంత హడావిడిగా షూటింగులు చేసి ఫైనల్ కాపీ సిద్ధం చేయడానికి ఏ సినిమాకైనా టైం సరిపోదు. అందులోనూ ఇరుముడి తర్వాత రవితేజ చాలా క్యాలికులేటెడ్ గా మారిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత కంబ్యాక్ అయ్యాక ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. బాలయ్య మూవీ హోల్డ్ లో పడిన తరువాత వచ్చిన అవకాశం కావడంతో వివేక్ ఆత్రేయ సైతం దీని కోసం చాలా హోమ్ వర్క్ చేశారని టాక్. 

This post was last modified on September 5, 2026 7:46 am

Share

Recent Posts

బీఆర్ఎస్‌కు క‌ష్ట కాల‌మా… న‌ష్ట కాల‌మా?!

దానం నాగేంద‌ర్‌పై వేటు ప‌డ‌డం.. ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావ‌డం.. ఇటీవ‌ల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…

4 hours ago

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

6 hours ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

6 hours ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

8 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

9 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

10 hours ago