సినిమా షూటింగ్ చేశామా.. ఆ పని అవ్వగానే పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లిపోయామా అన్నట్లుండే హీరో ప్రభాస్. పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్‌గా అవతరించినా.. మీడియాలో కనిపించాలనే తాపత్రయం ఎంతమాత్రం లేకుండా తన స్పేస్‌లో తానుంటాడు రెబల్ స్టార్. కానీ అభిమానులకేమో అతను రెగ్యులర్‌గా బయటికొస్తే చూడాలని.. సినిమా ఈవెంట్లలో పాల్గొనాలని కోరికగా ఉంటుంది. కానీ ప్రభాస్ ఏమో సిగ్గరి. ఎప్పుడో కానీ.. బయటికి రాడు. తన లుక్ చూపించడు. తనకు సన్నిహితులైన వ్యక్తులకు సంబంధించిన సినిమాలు వేటినైనా ప్రమోట్ చేసినా.. సోషల్ మీడియా పోస్టుల వరకే ఉంటుంది. ఈవెంట్లకు రావడం అరుదు.
ఐతే తనతో స్పిరిట్ మూవీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్ చేసిన చిన్న సినిమా రోమాంచకం కోసం ప్రభాస్ కొంచెం ఎక్కువ ఎఫర్టే పెట్టాడు. రోమాంచకం టీంను కలిశాడు. ట్రైలర్ చూశాడు. వాళ్లతో కబుర్లు చెప్పాడు. కావాల్సిన సపోర్ట్ ఇచ్చాడు. ఐతే ఈ చిత్ర హీరో సుమంత్ ప్రభాస్‌ను కలిసిన వీడియో ఒకటి టీం రిలీజ్ చేయగా.. అందులో ప్రభాస్ ముఖం చూపించకపోవడంతో అభిమానులు బాగా ఫీలయ్యారు.
మరీ ఇంత దాపరికం ఏంటి.. ఫౌజీ లుక్‌ను దాస్తున్నారా, లేక ప్రభాస్ మెయింటైనెన్స్ సరిగా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే ఈ చర్చ జరుగుతుండగానే.. రోమాంచకం టీం ప్రభాస్‌ను కలిసిన ఫొటోలు బయటికి వచ్చేశాయి. టీం అందరితో కూర్చుని రోమాంచకం ట్రైలర్ చూసిన ఫొటోలతో పాటు.. హీరో సుమంత్ ప్రభాస్‌కు హగ్ ఇచ్చి అతడి షర్టు మీద విషెస్ రాసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాజాసాబ్ టైంలో కంటే ప్రభాస్ ఇందులో చాలా మెరుగ్గా, ఆరోగ్యకరంగా కనిపిస్తున్నాడు. ఐతే ప్రభాస్ కొంచెం ఎక్కువ సన్నబడడంతో ముఖంలో కాస్త డల్‌నెస్ కనిపిస్తోంది. కానీ ఓవరాల్‌గా ప్రభాస్ ప్లెజెంట్ లుక్‌లో ఉండడం అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. ప్రభాస్ కొన్ని వారాల కిందటే స్పిరిట్ షూట్ నుంచి బ్రేక్ తీసుకుని ఫౌజీ చిత్రీకరణలో పాల్గొంటున్న నేపథ్యంలో లేటెస్ట్ లుక్ ఆ సినిమాకు సంబంధించినదే అని భావిస్తున్నారు. ఫౌజీ డిసెంబరు 3న రిలీజ్ కావాల్సి ఉండగా.. స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి రిలీజ్‌కు షెడ్యూల్ అయింది. ఆ సినిమా చిత్రీకరణ ఇప్పటిదాకా 40 శాతం పూర్తయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates