అక్కినేని నాగార్జున వందో సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా దర్శకుడిగా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి తమిళ దర్శకుడు రా.కార్తీక్‌తో నాగ్ జట్టు కట్టాడు. ఐతే నాగ్ ఇంత ప్రెస్టీజియస్ మూవీ చేస్తూ.. దానికి అధికారికంగా ప్రారంభోత్సవం జరపకపోవడం, సినిమా మొదలై ఏడాది కావస్తున్నా టైటిల్ సహా ఏ విశేషాన్నీ అభిమానులతో పంచుకోకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే.
షూటింగ్ చాలా వరకు అయిపోయినా ఇప్పటికీ ఏ అప్‌డేట్ లేదు. కనీసం తన పుట్టిన రోజు నాడైనా నాగ్.. ఈ సినిమా విశేషాలను బయటపెడతాడా లేదా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నాగ్ బర్త్ డేకి ఇంకో మూడు రోజులే మిగిలుండడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఐతే అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందాల్సిన పనేమీ లేదని తెలుస్తోంది. శనివారం నాడు నాగ్ పెద్ద ట్రీటే ఇవ్వబోతున్నాడట.
నాగ్ 100వ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను కింగ్ పుట్టిన రోజు నాడు పంచుకోనున్నారట. ఈ సినిమా ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా గ్లింప్స్ ఉంటుందట. ఇందులో నాగ్ మిడిలేజ్డ్ రోల్‌లో కనిపించబోతున్నాడట. తండ్రి-కూతురి బంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని.. కుటుంబ అంశాలతో పాటు యాక్షన్, థ్రిల్ మిక్స్ అయిన సినిమా ఇదని అంటున్నారు. ఈ చిత్రంలో టబు ఓ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. గతంలో ‘నాట్యం’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసిన సుష్మిత భట్ ఇంకో కీలక పాత్రలో కనిపించనుంది.
నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగ్ 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు వరకు డిఫరెంట్ గెటప్స్‌తో కనిపిస్తాడట. శనివారం రిలీజ్ చేసే గ్లింప్స్‌లో నేరుగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని.. ఇక్కడి నుంచి వరుసగా అప్‌డేట్స్‌తో సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తారని సమాచారం. రా.కార్తీక్ ఇంతకుముందు తమిళంలో ఆకాశం, మేడ్ ఇన్ కొరియా, నిత్తమ్ ఒరు వానం సినిమాలు రూపొందించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates