మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా సింపుల్‌గా ఉంటాడతను. వివాదాలకు దూరంగా ఉండే ఈ హీరో.. తనకు ఒక సినిమా టీం నుంచి ఇబ్బంది ఎదురైతే, దాని మీద వివాదం చేయకుండా ఎంతో హుందాగా వ్యవహరించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. గతంలో తమిళంలో ‘నేరం’ సినిమాలో నటించిన నివిన్.. చాలా గ్యాప్ తర్వాత ‘బెంజ్’ మూవీలో నటించడానికి అంగీకరించాడు.
లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్శ్’లో భాగం కావడంతో అనౌన్స్ చేసినపుడే మంచి హైప్ తెచ్చుకుంది. కానీ ఈ చిత్రాన్ని ప్రకటించిన రెండేళ్లు కావస్తుండగా.. ఇప్పటికీ సినిమా రెడీ కాలేదు. అసలు షూటింగ్ ఎంత మేర జరిగిందన్నదీ సందేహమే. ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డదీ నివిన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘బెంజ్’ సినిమాలో తన పాత్ర కోసం గడ్డం పెంచానని.. ఆ సినిమా షూటింగ్ కోసమని గడ్డం తీయకుండా అలాగే ఉంచానని.. దీంతో తాను నటించే వేరే చిత్రాల కోసం కూడా ఆ గడ్డాన్ని అలాగే ఉంచాల్సి వచ్చిందని నివిన్ తెలిపాడు. ‘బెంజ్’ సినిమాలో తన పాత్రపై చిత్రీకరణ జరగడానికి ముందే తన మలయాళ సినిమాలు రెండు రిలీజయ్యాయని.. ‘బెంజ్’ కోసం పెంచిన గడ్డంతోనే ఆ సినిమాల్లో కనిపించాల్సి వచ్చిందని అతను తెలిపాడు.
తనకు ఇంకో నెల రోజుల సమయం ఉందని.. ‘బెంజ్’ టీం ఆ సినిమా సంగతేంటో తేల్చాలని ఈ ఇంటర్వ్యూ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని నివిన్ అన్నాడు. పెద్ద స్టార్ అయినప్పటికీ ఇలా వినమ్రంగా తన ఇబ్బందిని నివిన్ తెలియజేయడం తన హుందాతనానికి నిదర్శనం.
భాగ్యరాజ్ కన్నన్ ‘బెంజ్’ మూవీకి దర్శకుడు కాగా.. లోకేష్ కనకరాజ్ స్క్రిప్టు అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఈ సినిమా ఎందుకింత ఆలస్యం అవుతోందో కానీ.. నివిన్ లాంటి కమిట్మెంట్ ఉన్న నటుడిని ఇబ్బంది పెట్టడం మాత్రం తప్పే. కాబట్టి లోకేష్ అండ్ టీమ్ నివిన్ సేవలను సరిగ్గా ఉపయోగించుకుని ఈ సినిమాను త్వరగా పూర్తి చేస్తే మంచిది. కొన్నేళ్లు వరుస ఫ్లాపులతో సతమతం అయిన నివిన్.. గత ఏడాది ‘సర్వం మాయ’తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇటీవలే ‘బెత్లెహాం కుడుంబ యూనిట్’తో మరో మంచి విజయాన్నందుకున్నాడు.
This post was last modified on August 26, 2026 4:37 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…