తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో వాళ్ళు ఇచ్చే క్లాసిక్స్ ఎందరికో రిఫరెన్స్ గా మారిపోయి, మిగిలిన వాళ్ళను అదే దారిలో వెళ్లేలా చేస్తాయి. రామ్ గోపాల్ వర్మ శివ వచ్చాక టాలీవుడ్ ఫిలిం మేకింగ్ లో మార్పులు వచ్చిన వాస్తవాన్ని కాదనలేం. అంతకు ముందు శంకరాభరణంతో కె విశ్వనాథ్ వేసిన ముద్ర ఎన్నో మ్యూజికల్ మూవీస్ వచ్చేలా చేసింది. ఇలాంటివి చరిత్రలో కొన్నే ఉంటాయి.
ఇప్పటి జనరేషన్ లో చూసుకుంటే సందీప్ రెడ్డి వంగా ఎఫెక్ట్ చాలా మంది ఫిలిం మేకర్స్ మీద పడుతోంది. అర్జున్ రెడ్డి ఇంటర్వెల్ ఎపిసోడ్ డిజైన్ చేసిన తీరు, యానిమల్ బోల్డ్ కంటెంట్ ని ఎలాంటి మొహమాటం లేకుండా ఆర్గానిక్ గా చూపించిన విధానం ఆడియన్స్ ని మెప్పించింది. రన్బీర్ కపూర్ తోటలో నగ్నంగా నడుచుకుంటూ వెళ్లే సీన్ మీద ఎలాంటి గొడవ జరగలేదంటే దానికర్థం అంత కన్విన్సింగ్ గా స్క్రీన్ ప్లే రాయడం వల్లే. ఇది కాదు కానీ స్పిరిట్ లో కూడా ఇలాంటి షాకులు ఉంటాయట.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే రొమాన్స్, సెక్స్ మధ్య సన్నని గీత ఉంటుంది. దాన్ని తెలివిగా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం టైటానిక్ మూవీలో హీరో హీరోయిన్ వాహనంలో శారీరకంగా ఒక్కటయ్యే సీన్ ఉంటుంది. అది పూర్తయ్యిందని చెప్పడానికి దర్శకుడు జేమ్స్ క్యామరూన్ తెలివిగా ఒక సింబాలిక్ షాట్ పెడతారు. దానికి జనం విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. అక్కడేం చూపించకపోయినా చూసిన ఫీలింగ్ తెప్పించారు. సందీప్ చేసేది కూడా ఇదే.
కానీ కొందరు దర్శకులు ఆ పల్చని తేడాని గుర్తించలేక బోల్డ్ అంటే పచ్చిగా చూపించడం అనుకుంటారు. టాక్సిక్ లో గీతూ మోహన్ దాస్ అలాంటి సన్నివేశాలు పెట్టారు. సినిమా టాక్ ఎలా ఉన్నా వీటి గురించి ఆడియన్స్ లో డిస్కషన్ వచ్చినప్పుడు ఆ సీన్స్ లో మెచ్యురిటీ మిస్ కావడాన్ని ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఫలితంగా కొందరికి అవి బూతులా అనిపించి ఉండొచ్చు. ఏదేమైనా సందీప్ వంగ ఇంపాక్ట్ భాషతో సంబంధం లేకుండా ప్రతి చోట ఉందని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా.
Gulte Telugu Telugu Political and Movie News Updates