Movie News

క్రేజీగా మారుతున్న టాలీవుడ్ డిసెంబర్

అందరూ సంక్రాంతి గురించి మాట్లాడుకుంటున్నారు కానీ రాబోయే డిసెంబర్ కూడా క్రేజీ సినిమాలతో పీక్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేలా ఉంది. పండక్కు క్లాష్ చేసుకుని వసూళ్లు తగ్గించుకోవడం కన్నా సంవత్సరం చివరిలో వచ్చి హిట్టు కొట్టేసుకునే ప్లాన్ లో ఒక్కొక్కరుగా తోడవుతున్నారు. ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 4 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా మూడు నెలలే సమయం ఉండటంతో దర్శకుడు హను రాఘవపూడి చివరి షెడ్యూల్స్ పూర్తి చేసేందుకు టీమ్ ని పరుగులు పెట్టిస్తున్నారు.

క్రిస్మస్ లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ 24 ‘బాలయ్య 111’ రావడం దాదాపు పక్కానే.  గాయం వల్ల బాలకృష్ణ ఇంకా విశ్రాంతిలోనే ఉన్నప్పటికీ సెప్టెంబర్ నుంచే సెట్స్ లో అడుగు పెడతారని టాక్. అదే జరిగితే దర్శకుడు గోపీచంద్ మలినేని అనుకున్న టైంకి అవుట్ ఫుట్ సిద్ధం చేస్తారు. నాగార్జున వందో సినిమా ‘కింగ్ 100’ని నెలాఖరులో దించే ఆలోచన ఉందట. మాస్, మన్మథుడు లాంటి సూపర్ హిట్స్ నాగ్ కు ఈ టైంలోనే కలిసి వచ్చాయని ఫ్యాన్స్ సెంటిమెంట్ గా ఫీలవుతారు.

ఇక్కడితో అయిపోలేదు. స్లాట్ కోసం వెతుకుతున్న నాగ చైతన్య ‘వృషకర్మ’ అదే నెల వైపు చూస్తోంది. అయితే చైతు తన తండ్రితో క్లాష్ అయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి కనీసం రెండు వారాలు గ్యాప్ తీసుకోవాలి. బాలయ్య కనక ఏదైనా కారణాల వల్ల తప్పుకుంటే ఆ స్లాట్ ఏమైనా తీసుకుంటారేమో చూడాలి. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ, రాపో 23 వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం. వీటికి తోడు షారుఖ్ ఖాన్ ‘కింగ్’  ప్యాన్ ఇండియా భాషల్లో డిసెంబర్ 25 విడుదలకు రెడీ చేస్తున్నారు.

ఇక్కడ చెప్పినవాటిలో ఒక్క ఫౌజీ, కింగ్ మాత్రమే అఫీషియల్ గా డేట్స్ లాక్ చేసుకున్నాయి. మిగిలినవి తగిన సందర్భం కోసం ఎదురు చూస్తున్నాయి. జనవరిలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ముందుగానే వచ్చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అసలే జూన్ నుంచి నెలకు రెండు మూడు హిట్లతో టాలీవుడ్ కళకళలాడుతోంది. ఇది వచ్చే సంక్రాంతి వరకు ఇలాగే ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఆసక్తికంగా మారుతున్నాయి. 

This post was last modified on August 26, 2026 4:13 pm

Share

Recent Posts

విజయ్‌తో ఫొటో.. పనిమనిషి కల నిజం చేసిన ప్రియాంక గాంధీ

ప్రియాంక గాంధీ తన ఇంట్లో గత 22 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళకు ఒక మధురమైన అనుభూతిని అందించారు. తమిళనాడు సీఎం…

17 minutes ago

ఇకపై బైకులకు కూడా సేఫ్టీ ఎయిర్‌బ్యాగ్స్

కార్లలో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడటంలో ఎయిర్‌బ్యాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అదే టెక్నాలజీని ఇప్పుడు హెల్మెట్‌లోనూ ఉపయోగించే ఆలోచన…

51 minutes ago

ధోనీ ఎందుకింత స్పెషల్?

ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే చాలు.. చెన్నైతో సంబంధం లేని జట్ల అభిమానులు కూడా అతడి కోసం ఎదురుచూసేవారు. ఒక్కోసారి సొంత…

51 minutes ago

ఈసీ vs యోగి… ఇది ఊహించలేదే..!

డామిట్... కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా తయారైంది బీజేపీ పరిస్థితి. వివాదాస్పద " ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ…

1 hour ago

ధోనీ లేకుండా CSK… ఇప్పుడు మారాల్సింది ఏంటి?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ ఆ జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇక…

1 hour ago

అంతా ఎప్పటిలాగే ఉంటుందని చెప్పనన్న నాదెళ్ల

మైక్రోసాఫ్ట్‌ లో ఉద్యోగాలపై సీఈవో సత్య నాదెళ్ల కూడా హామీ ఇవ్వలేకపోతున్నారు. భారత్ సహా నాలుగు దేశాల్లో ఉద్యోగులకు కంపెనీ…

2 hours ago