Movie News

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం చూసే హీరోయిన్ గా తన గురించి ముంబై మీడియా ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చింది. కానీ గత కొంత కాలంగా ఈ అమ్మడికి సరైన సక్సెస్ దక్కలేదు. వార్ 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీలో హృతిక్ రోషన్ సరసన నటిస్తే అదేమో యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అయ్యింది. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా లాభం లేకపోయింది.

దానికన్నా ముందు ‘గేమ్ ఛేంజర్’ మరో పీడకల. శంకర్ లాంటి లెజెండరీ దర్శకుడు కదా పెద్ద బ్రేక్ ఇస్తాడనుకుంటే ఆయనేమో అల్ట్రా డిజాస్టర్ చేతిలో పెట్టాడు. రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ తర్వాత రెండోసారి జట్టు కట్టిన కియారాకు తీవ్ర నిరాశ తప్పలేదు. బాలీవుడ్ మూవీ సత్య ప్రేమ్ కి కథ, గోవిందా నామ్ మేరే అడ్రెస్ లేకుండా పోగా ‘జగ్ జగ్ జియో’ ఓ మోస్తరుగా ఓకే అనిపించుకుంది. తన చివరి హిట్టు నాలుగేళ్ళ క్రితం వచ్చిన భూల్ భులయ్యా 2.

పెళ్లయ్యాక కొంచెం బ్రేక్ తీసుకోవడం, తల్లి కావడం లాంటి పరిణామాల వల్ల కియారాకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు టాక్సిక్ రూపంలో కన్నడలో అడుగు పెట్టింది. అయితే ఇందులో తనే మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ కథ మొత్తం తన చుట్టే తిరిగదు. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషిలు కూడా ఉన్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ అందరికీ తగిన ప్రాధాన్యం ఇచ్చి ఉంటే కనక కియారా ఎంత హైలైట్ అవుతుందనేది చెప్పలేం.

బ్లాక్ బస్టర్ అయితే మటుకు సౌత్ నుంచి క్రేజీ ఆఫర్స్ రావడం ఖాయం. ముఖ్యంగా తమిళం వైపు ఆమె చూపు గట్టిగానే ఉంది. ఓకే అంటే ఆఫర్లు ఇచ్చేందుకు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టాక్సిక్ లో కియారాకు చెప్పుకోదగ్గ స్పేస్ దక్కిందట. ఒక షాకింగ్ ట్విస్టు కూడా ఉంటుందని, సాధారణంగా హీరోయిన్లు చేయడానికి ఒప్పుకోని ఒక ముఖ్యమైన మలుపుకు ఎస్ చెప్పిందని అంటున్నారు. అదేంటో తెలియాలంటే మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోయే ప్రీమియర్లలో చూడాలి. 

This post was last modified on August 25, 2026 8:11 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

5 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago