నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో తర్వాత ఆ స్థాయిలో అందరిని ఎట్రాక్ట్ చేసింది మణికంఠ క్యారెక్టర్. ఆ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర నటనకు ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీతో ఆ పాత్రకు ప్రాణం పోసిందని అంతా మెచ్చుకుంటున్నారు.

ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా ఈ సినిమా చూశారు. అందులో నక్షత్ర పలికించిన ఎమోషన్స్ కు ఆయన పూర్తిగా ఫిదా అయ్యారు. స్క్రీన్ మీద ఆ పాప నటన అంత న్యాచురల్ గా ఉండటంతో డైరెక్ట్ గా అభినందించాలని ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ శివ నిర్వాణ ద్వారా వీడియో కాల్ చేసి నక్షత్రతో మాట్లాడారు. ఈ వీడియో కాల్ కు సంబంధించిన ఒక క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

అందులో ధనుష్ అడిగిన ప్రశ్న వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మనం ఎప్పుడైనా కలిసినప్పుడు నాకు కూడా యాక్టింగ్ నేర్పిస్తావా అని అడగడం చూస్తుంటే నక్షత్ర పెర్ఫార్మన్స్ ధనుష్ కు ఎంతలా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఆ మాట వినగానే పక్కనే ఉన్న శివ నిర్వాణ కూడా సంతోషంతో నవ్వేశారు. యాక్టింగ్ లో తనకంటూ ఒక సెపరేట్ బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న నటుడు ధనుష్. ఆయన లాంటి వ్యక్తి స్వయంగా ఫోన్ చేసి ప్యూర్ పెర్ఫార్మన్స్ అని మెచ్చుకోవడం ఏ ఆర్టిస్ట్ కి అయినా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. 

మణికంఠ పాత్రలో ఉన్న డెప్త్ ను ఆ పాప పర్ఫెక్ట్ గా క్యారీ చేసిన విధానం వల్లే ఇంతటి ప్రశంసలు దక్కుతున్నాయి. ధనుష్ అడిగిన వెంటనే నక్షత్ర కూడా సిగ్గుపడుతూ సరేనని చెప్పడం ఈ వీడియోలో భలే ముద్దుగా అనిపిస్తుంది. ఎప్పటికైనా కలుద్దాం అని చెప్పి ఆయన కాల్ ముగించారు. కెరీర్ స్టార్టింగ్ లోనే ఒక గొప్ప నటుడి నుంచి ఇలాంటి కాంప్లిమెంట్ రావడం ఆ పాప ఫ్యూచర్ కు చాలా ప్లస్ అవుతుంది. ఇక నక్షత్ర నెక్స్ట్ ఫ్యూచర్ ఎలాంటి పాత్రలతో వెళుతుందో చూడాలి.