వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే దీనికొచ్చే గ్లోబల్ రీచ్ తర్వాత మహేష్ ప్రతి సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయి. బాహుబలి నుంచి ప్రభాస్ రేంజ్ ఎక్కడికి వెళ్లిందో చూస్తున్నాం. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ప్రతి దర్శకుడు, నిర్మాత లార్జర్ దాన్ లైఫ్ కథలను రాసుకుని డార్లింగ్ ని వీలైనంత ఎలివేషన్లతో చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ కన్నా భారీ బడ్జెట్, వరల్డ్ క్లాస్ విజువల్స్ తో వారణాసి రూపొందుతోంది. క్యామరూన్, స్పీల్ బర్గ్ లాంటి ప్రఖ్యాత ఫిలిం మేకర్స్ సైతం దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజా లీక్ ప్రకారం మహేష్ ని ట్రై చేస్తున్న వాళ్ళ లిస్టులో అనిల్ రావిపూడి పేరు కూడా ఉందట. 2028 సంక్రాంతి టార్గెట్ చేసుకుని సూపర్ స్టార్ తో ఒక ఫుల్ యాక్షన్ కం కామెడీ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకుని స్టోరీ వినిపించే ప్రయత్నాలు జోరుగా చేస్తున్నారట.
అనిల్ అంటే మహేష్ కు ప్రత్యేకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. సరిలేరు నీకెవ్వరుని తక్కువ టైంలో పూర్తి చేసి టఫ్ కాంపిటీషన్ లోనూ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడిగా స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తాడు. అయితే ఇప్పుడు లెక్కలు వేరు. గుంటూరు కారం తర్వాత రావిపూడితో అంటే ఏదో అనుకోవచ్చు. కానీ వారణాసి వచ్చాక అంటే మాత్రం అభిమానులకు ఎంతో కొంత రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే రావిపూడి స్కూల్ ఎంటర్ టైన్మెంట్ ఇప్పుడు మహేష్ కి మ్యాచ్ అవ్వకపోవచ్చు.
ఇదంతా ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు నిర్ధారణగా చెప్పలేం కానీ కార్యరూపం దాల్చే దాకా ఏదీ నమ్మలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబోలో జనవరి 12 విడుదల తెరకెక్కిస్తున్న రావిపూడి ఇంకోవైపు చిరంజీవి – నాగార్జున కలయికని సెట్ చేసేందుకు బలంగా ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఒకవేళ మహేష్ నుంచి సానుకూల సిగ్నల్ రాకపోతే ఇటువైపు షిఫ్ట్ అవుతారేమో. మరి మహేష్ మనసులో ఏముందో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates