‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా కనిపించే రవితేజ ఈసారి ఇంకాస్త ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు. చిత్ర యూనిట్ సభ్యులను పలకరిస్తూ, నవ్వుతూ, అలా ఎగురుకుంటూ స్టేజ్ వైపు వచ్చిన తీరు చూస్తే ఈ హిట్ ఆయనకు ఎంత రిలీఫ్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దానికి కారణం కూడా ఉంది. గత కొంతకాలంగా రవితేజకు సరైన బాక్సాఫీస్ రిజల్ట్ పడలేదు. ‘టైగర్ నాగేశ్వరరావు’ పెద్ద అంచనాలతో వచ్చినా పూర్తి స్థాయిలో పని చేయలేదు. ‘ఈగల్’ కూడా ఆశించిన రేంజ్‌కు వెళ్లలేదు. ‘మిస్టర్ బచ్చన్’ మరింత నిరాశపరిచింది. తర్వాత వచ్చిన ‘మాస్ జాతర’ కూడా రవితేజను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురాలేకపోయింది. వరుస సినిమాలు చేస్తూనే ఉన్నా ఒక గట్టి హిట్ మాత్రం మిస్ అవుతూ వచ్చింది.
అలాంటి సమయంలో ‘ఇరుముడి’ మొదటి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. వీకెండ్ తర్వాత కూడా బుకింగ్స్ తగ్గకుండా ఉండటం, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం రవితేజకు కావాల్సిన రిజల్ట్ ఇచ్చింది. అందుకే సక్సెస్ మీట్‌లో కనిపించిన ఆ హ్యాపీనెస్ జస్ట్ ఒక సినిమా హిట్ అయిందనే ఆనందం కంటే కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది.
రవితేజ కెరీర్‌లో ఇలాంటి బౌన్స్ బ్యాక్స్ కొత్త కాదు. ఒక సమయంలో వరుసగా సినిమాలు మిస్ అయిన తర్వాత ‘రాజా ది గ్రేట్’ మంచి బూస్ట్ ఇచ్చింది. తర్వాత మరోసారి కెరీర్ డౌన్‌లో ఉన్నప్పుడు ‘క్రాక్’, ‘ధమాకా’ వచ్చాయి. కానీ ఈసారి ‘ఇరుముడి’ ఇచ్చిన హిట్ కాస్త వేరుగా ఉంది. రెగ్యులర్ మాస్ ఫార్ములా మీద మాత్రమే ఆధారపడకుండా, ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న కథలో రవితేజను చూపించారు. చాలా రోజుల తర్వాత ఆయన సినిమా గురించి మొదటి వీకెండ్ దాటాక కూడా పాజిటివ్‌గా మాట్లాడుకోవడం కనిపిస్తోంది.
ఇప్పుడు అసలు పని తర్వాతి సినిమాల దగ్గర ఉంటుంది. గతంలో ‘క్రాక్’ తర్వాత వచ్చిన మోమెంటమ్ పూర్తిగా కొనసాగలేదు. ఈసారి మాత్రం వచ్చిన హిట్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే రవితేజకు మళ్లీ మంచి ఫేజ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మాత్రం సక్సెస్ మీట్‌లో ఆయన ముఖం చూస్తే చాలు.. ‘ఇరుముడి’ ఇచ్చిన ఆనందం ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.
Mass Maharaja's energetic entry 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) August 24, 2026
Watch the #Irumudi Blockbuster Pressmeet live now ❤🔥
▶️ https://t.co/FwKPCA4yTb
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/8xMIHkkBBt
Gulte Telugu Telugu Political and Movie News Updates