Movie News

ఇది మన ఇరుముడి – చదుకోవాల్సిన కేస్ స్టడీ

ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే థియేటర్లు సైతం ఫస్ట్ షో సెకండ్ షో తేడా లేకుండా హౌస్ ఫుల్స్ కావడం ఊహకందని అద్భుతం. ఇదంతా కేవలం రవితేజ ఇమేజ్ అనలేం. ఎందుకంటే తను ఇలాంటి బ్లాక్ బస్టర్ చూసి ఎన్ని సంవత్సరాలయ్యాయో అభిమానులే మర్చిపోయారు. ఆ ఆకలి మొత్తాన్ని తీర్చే దిశగా ఇరుముడి వంద కోట్ల గ్రాస్ వైపు పరుగులు పెడుతోంది.

నిజానికి ఇరుముడిని ఒక కేస్ స్టడీగా చూడాలి. ఈ సినిమాలో వరల్డ్ బిల్డింగ్ లేదు. మాఫియాలు, తుపాకులు, చీకటి ప్రపంచాలు, నెత్తుటి మొహంతో విలన్లను చీల్చేసే హీరో ఇవేవీ మచ్చుకు కూడా లేవు. పోనీ గ్లామర్ హీరోయిన్ ని పెట్టుకుని డ్యూయెట్ల లాంటివి పెట్టారా అంటే దానికీ నో అనే సమాధానమే వినిపిస్తుంది. మరి ఎందుకు ఇంతగా పట్టేసుకుంది. లోపాలు, హెచ్చుతగ్గులు అస్సలు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి. అయినా సరే ప్రేక్షకులు వాటిని క్షమించేశారు.

దర్శకుడు శివ నిర్వాణ మెదడులో పుట్టిన ఒక అద్భుతమైన ఆలోచనే ఇరుముడి సక్సెస్ కి తొలిమెట్టు. ఇప్పటిదాకా టాలీవుడ్ స్టార్ హీరోలెవరూ అయ్యప్ప మాల వేసుకున్న పాత్రలు చేయలేదు. ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం బిగ్ బాస్ లో చిరంజీవి కాసేపు ఆ దుస్తుల్లో ఉంటారు తప్పించి ఆ దీక్ష మీద పాటలు, ప్రత్యేకమైన ఎపిసోడ్లు కానీ ఉండవు పైగా అది డిజాస్టర్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఏడాది మాల వేసుకునే భక్తులు కోట్లలో ఉంటారు. వాళ్ళ కుటుంబాలలో అంతే భక్తి భావం ఉంటుంది.

సరిగ్గా ఈ పాయింటే ఇరుముడికి క్యాష్ బాక్స్ గా మారిపోయింది. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ మూవీ భక్తిరస చిత్రం కాదు. అయ్యప్ప మహిమలు చూపడం లాంటివి లేవు. పైపెచ్చు అమాయకులు చనిపోయే క్రైమ్స్ ఉంటాయి. రివెంజులు కూడా పెట్టారు. అయినా సరే ఇంతగా కనెక్ట్ కావడానికి కారణం కూతురి సెంటిమెంట్. బిడ్డంటే ప్రాణమిచ్చే ఒక తాగుబోతు తండ్రి ఆమె కోసం ఏం చేయడానికైనా, ఎంత దూరం వెళ్లడానికైనా తెగించే మనస్తత్వాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే పదిహేనేళ్ళుగా అయ్యప్ప భక్తులను ఊపేస్తున్న మల్లెపూల పల్లకి పాటను సరైన టైమింగ్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో చిత్రీకరించిన విధానం రిపీట్ ఆడియన్స్ ని తీసుకురావడం అబద్దం కాదు. తెరమీద చాలా సహజంగా గొప్పగా వచ్చింది పాట. ఒక చిన్న ఊరిలో రెండున్నర గంటల నెరేషన్ ని బోర్ కొట్టించకుండా చూపించవచ్చని నిరూపించిన ఇరుముడి వందల కోట్లు ఖర్చు పెట్టకుండానే మేజిక్ ఎలా చేయొచ్చో నిరూపించింది. స్టార్ హీరోలు ఇకపై దీన్ని సీరియస్ గా ఆలోచిస్తే వండర్స్ చేయొచ్చు. 

This post was last modified on August 24, 2026 10:02 am

Share

Recent Posts

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

2 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

12 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago