Movie News

థియేటర్లలో వావ్… ఇప్పుడు వామ్మో

కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు ప్రేక్షకులు. అలాగే కొన్ని సినిమాలు థియేటర్లలో బాగా ఆడేస్తుంటాయి. కానీ డిజిటల్‌గా రిలీజైనపుడు నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంటాయి. తాజాగా సోనీ లివ్ ద్వారా డిజిటల్‌గా రిలీజైన ‘చెన్నై లవ్ స్టోరీ’ రెండో జాబితాలోనే చేరుతోంది.

గత నెల 24న రిలీజైన ‘చెన్నై లవ్ స్టోరీ’కి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. కానీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లు వచ్చి ఆ సినిమాను ఆదరించారు. తొలి వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’ తర్వాత కూడా బలంగా నిలబడింది. రెండో వీకెండ్లో కూడా కొత్త సినిమాలా ఆదరణ పొందింది. ఫుల్ రన్లో రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కుకు చేరువగా వెళ్లి బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకుంది. ఈ సినిమా స్థాయికి అది చాలా పెద్ద నంబరే.

కానీ డిజిటల్‌గా రిలీజయ్యాక సినిమాను చూస్తున్న ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎలా అంత పెద్ద హిట్ చేశారు అని ఆశ్చర్యపోతున్నారు. థియేటర్లలో సినిమా చూసిన వాళ్లు ఫస్టాఫ్ సూపర్.. సెకండాఫ్ కొంచెం వీక్ అని అన్నారు. ఐతే డిజిటల్ ఆడియన్స్ మాత్రం ఫస్టాఫ్ పర్వాలేదు.. సెకండాఫ్ హారిబుల్ అని కామెంట్లు చేస్తున్నారు.

హీరో చనిపోయి ఆత్మగా తిరిగి వచ్చాక సన్నివేశాల విషయంలో, అలాగే క్లైమాక్స్ గురించి చాలా నెగెటివ్‌గా స్పందిస్తున్నారు డిజిటల్ ఆడియన్స్. సినిమా మరీ స్లోగా ఉందనే కంప్లైంట్లు కూడా బాగా వినిపిస్తున్నాయి. థియేటర్లలో పాటలను, విజువల్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం వల్ల దాని తాలూకు పాజిటివిటీ ప్లస్ అవుతుంది.

కానీ డిజిటల్‌గా చూసేటపుడు అవంత గొప్పగా అనిపించవు. దీనికి తోడు సెకండాఫ్ మరీ స్లోగా ఉండడం.. ఈ కాన్సెప్ట్‌తోనే ప్రేక్షకులు సరిగా కనెక్ట్ కాలేకపోవడం వల్ల ప్రేక్షకులకు అసహనం కలుగుతున్నట్లు కనిపిస్తోంది. సాయిరాజేష్ స్క్రిప్టుతో రవి నంబూరి రూపొందించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్, ఎస్కేన్ కలిసి నిర్మించారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ ఇందులో లీడ్ రోల్స్ చేశారు.

This post was last modified on August 23, 2026 3:55 pm

Share

Recent Posts

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

1 minute ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

59 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

2 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

4 hours ago