Movie News

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ‘ఇరుముడి’ సినిమా రుజువు చేస్తోంది. టైర్-1 హీరోల సినిమాలకు దగ్గరగా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. నిన్న ఈవెనింగ్, నైట్ షోలకు ఎక్కడా టికెట్ ముక్క మిగలని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సిటీల నుంచి చిన్న టౌన్ల వరకు ప్రతి చోటా ‘ఇరుముడి’కి హౌస్ ఫుల్స్ పడ్డాయి.

ఈ రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ రాంపేజ్ కొనసాగుతోంది. ఆదివారం కూడా ‘ఇరుముడి’కి తిరుగుండదని స్పష్టమవుతోంది. నిర్మాతలు, బయ్యర్ల పెట్టుబడి మొత్తాన్ని వీకెండ్లోనే సినిమా వెనక్కి తెచ్చేస్తే ఆశ్చర్యం లేదు. తొలి రోజు అంత మంచి ఆరంభం దక్కింది ‘ఇరుముడి’కి. ట్రేడ్ అంచనాలన్నీ దాటేస్తూ ‘ఇరుముడి’ శుక్రవారం వరల్డ్ వైడ్ రూ.24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇది రవితేజ చివరి చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫుల్ రన్ వసూళ్లకు సమానం కావడం విశేషం.

సంక్రాంతి లాంటి క్రేజీ సీజన్లో రిలీజైనప్పటికీ.. ఆ సీజన్‌కు తగ్గ ఫ్యామిలీ మూవీ అయినప్పటికీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఫుల్ రన్లో పాతిక కోట్ల లోపు గ్రాస్, రూ.12 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది. కానీ ‘ఇరుముడి’ మాత్రం తొలి రోజు దాదాపు దానికి సమానమైన కలెక్షన్ రాబట్టి ఔరా అనిపించింది. ఇది రవితేజ మార్కు మాస్ మూవీ కాకపోయినా.. ఈ రేంజ్ కలెక్షన్ రావడం విశేషమే.

ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు బాగా ఆడుతుండడం.. పైగా కథాకథనాలు చాలా బాగుండడం.. ఎమోషన్ బాగా వర్కవుట్ కావడం.. అన్నింటికీ మించి ఈ చిత్రంతో అయ్యప్ప స్వామి కనెక్షన్ ఉండడం.. సినిమాకు బాగా ప్లస్ అయి.. బాక్సాఫీస్ దగ్గర ‘ఇరుముడి’ అద్భుతాలు చేస్తోంది. రవితేజకు ఇది వంద కోట్ల సినిమా కావడం లాంఛనమే. కానీ సినిమా అంతటితో ఆగేలా లేదు. ఇంకా పెద్ద రేంజికి వెళ్లి మాస్ రాజా కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

This post was last modified on August 22, 2026 3:18 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

41 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago