Movie News

ఇరుముడి టాక్… వైల్డ్‌ఫైర్‌లా అంటుకుంది

మాస్ రాజా రవితేజ చివరగా హిట్టు కొట్టింది 2022లో. ధమాకాతో ఆయన ఘనవిజయాన్నందుకున్నారు. నిజానికి అది కూడా ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా కాదు. అయినా పరిస్థితులు కలిసొచ్చి.. మాస్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడంతో పెద్ద హిట్టయింది. ఆ తర్వాత రవితేజ నుంచి వచ్చిన ఆరు చిత్రాలు నిరాశపరిచాయి. ఈ ఏడాది సంక్రాంతికి ఆ పండక్కి సూటయ్యేలా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ మూవీ చేసినా ఫలితం లేకపోయింది.

ఇలాంటి ఫ్లాప్ స్ట్రీక్ తర్వాత వచ్చే సినిమాకు మామూలుగా బజ్ రావడం కష్టం. కానీ శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘ఇరుముడి’కి మాత్రం కథాంశం వల్ల, మరి కొన్ని సానుకూలతలు కూడా తోడై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా కనిపించాయి. ఇక రిలీజ్ రోజు ఉదయం ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తోంది.

ఉదయం మొదలైన పాజిటివ్ టాక్.. అంతకంతకూ పెరిగి సాయంత్రానికి వైల్డ్ ఫైర్ లాగా మారింది. ప్రస్తుతం ‘ఇరుముడి’కి బుక్ మై షోలో 30 వేలకు పైగా టికెట్లు అమ్మువడవుతుండడం విశేషం. తెలుగులో బీఎంఎస్‌లో గంటకు అత్యధికంగా టికెట్లు అమ్ముడైన సినిమాల్లో ‘ఇరుముడి’ టాప్-10లోకి వచ్చేయడం విశేషం.

ఈ రోజు ఈవెనింగ్, నైట్ షోలన్నీ ప్యాక్డ్ హౌస్‌లతో నడవబోతున్నాయన్నది స్పష్టం. ఈ మధ్య టాలీవుడ్లో నిలకడగా హిట్లు వస్తున్నాయి. యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలంటే జనం ఎగబడుతున్నారు. ‘ఇరుముడి’కి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. పైగా ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమానే. ఇంకేముంది బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల మోత మోగేలా కనిపిస్తోంది.

This post was last modified on August 21, 2026 10:26 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

2 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

8 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

8 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago