Movie News

ర‌వితేజ‌కు పుత్రికోత్సాహం

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మార‌డం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావ‌డం అరుదు. ఐతే సినీ కుటుంబాల అమ్మాయిలు గ‌తంలో సినిమాతో సంబంధ‌మే లేన‌ట్లు ఉండిపోయేవారు కానీ.. ఇప్పుడు మాత్రం న‌ట‌న‌లోకి రాక‌పోయినా, సినిమాతో సంబంధం ఉన్న వేరే విభాగంలో స్థిర‌ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మాస్ రాజా ర‌వితేజ కూతురు మోక్ష‌ద కూడా ఈ బాట‌లోనే సాగ‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మాస్ రాజా కొడుకు మ‌హాధ‌న్ ఇప్ప‌టికే రాజా ది గ్రేట్ సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. అత‌ను ప్ర‌స్తుతం అసిస్టెండ్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. భ‌విష్య‌త్తులో హీరో అయితే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. ఐతే ఈలోపే ర‌వితేజ కూతురు.. ఆయ‌న కొత్త సినిమా ఇరుముడికి తెర వెనుక కీల‌క పాత్ర పోషించడం విశేషం.

ఈ చిత్రానికి మోక్ష‌ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న ఇమేజ్‌కు పూర్తి భిన్న‌మైన‌ ఈ క‌థ‌కు ర‌వితేజ ఓకే చెప్ప‌డంలోనూ మోక్ష‌ద పాత్ర ఉన్న‌ట్లు స‌మాచారం. అంతే కాక సినిమా మొద‌లైన ద‌గ్గ‌ర్నుంచి మేకింగ్‌లో ఆమె త‌న వంతు పాత్ర పోషించింద‌ట‌. ఎప్పుడూ పెద్ద‌గా బ‌య‌ట క‌నిపించ‌ని మోక్ష‌ద‌.. ఇరుముడి రిలీజ్ సంద‌ర్భంగా ప‌బ్లిక్ అప్పీయ‌రెన్స్ ఇచ్చింది. త‌న సోద‌రుడు మ‌హాధ‌న్‌, క‌జిన్‌తో క‌లిసి థియేట‌ర్లో మాస్ రాజా అభిమానుల మ‌ధ్య ఇరుముడి సినిమా చూసింది.

కూతురు ల‌క్ తీసుకు వ‌చ్చిన‌ట్లు ఆమె మేకింగ్‌లో భాగ‌మైన తొలి సినిమా ర‌వితేజ‌కు చాన్నాళ్ల త‌ర్వాత మంచి విజ‌యాన్నందించే దిశ‌గా దూసుకెళ్తోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఇరుముడికి తొలి రోజు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. పాజిటివ్ టాక్ అంత‌కంత‌కూ పెరిగి ఈవెనింగ్, నైట్ షోల‌కు అంత‌టా హౌస్ ఫుల్స్ ప‌డిపోయాయి. మోక్ష‌ద మున్ముందు ర‌వితేజ సినిమాలన్నింటితోనూ అసోసియేట్ అయితే ఆశ్చ‌ర్య‌మేమీ లేదు. మున్ముందు ఆమె ప్రొడ్యూస‌ర్‌గా మారి తండ్రి సినిమాల‌ను నిర్మిస్తుందేమో చూడాలి.

This post was last modified on August 21, 2026 10:07 pm

Share

Recent Posts

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

12 minutes ago

అర్జున్ రెడ్డిని ఆదుకున్న మామిడి తోట‌

న‌టుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ద‌ర్శ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్ల‌ను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్ట‌ర్ అనే…

4 hours ago

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…

5 hours ago

ఎట్ట‌కేల‌కు తెలుగులో తొలి హిట్టు

త‌మిళంలో పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ శివ కార్తికేయ‌న్ లాగే టీవీ రంగం నుంచి ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన అమ్మాయి ప్రియ భ‌వానీ…

7 hours ago

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

8 hours ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

8 hours ago