స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా మారడం మామూలే. అమ్మాయిలు మాత్రం హీరోయిన్లు కావడం అరుదు. ఐతే సినీ కుటుంబాల అమ్మాయిలు గతంలో సినిమాతో సంబంధమే లేనట్లు ఉండిపోయేవారు కానీ.. ఇప్పుడు మాత్రం నటనలోకి రాకపోయినా, సినిమాతో సంబంధం ఉన్న వేరే విభాగంలో స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ రాజా రవితేజ కూతురు మోక్షద కూడా ఈ బాటలోనే సాగబోతోందని స్పష్టమవుతోంది.
మాస్ రాజా కొడుకు మహాధన్ ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. అతను ప్రస్తుతం అసిస్టెండ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో హీరో అయితే ఆశ్చర్యమేమీ లేదు. ఐతే ఈలోపే రవితేజ కూతురు.. ఆయన కొత్త సినిమా ఇరుముడికి తెర వెనుక కీలక పాత్ర పోషించడం విశేషం.
ఈ చిత్రానికి మోక్షద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన ఈ కథకు రవితేజ ఓకే చెప్పడంలోనూ మోక్షద పాత్ర ఉన్నట్లు సమాచారం. అంతే కాక సినిమా మొదలైన దగ్గర్నుంచి మేకింగ్‌లో ఆమె తన వంతు పాత్ర పోషించిందట. ఎప్పుడూ పెద్దగా బయట కనిపించని మోక్షద.. ఇరుముడి రిలీజ్ సందర్భంగా పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చింది. తన సోదరుడు మహాధన్, కజిన్‌తో కలిసి థియేటర్లో మాస్ రాజా అభిమానుల మధ్య ఇరుముడి సినిమా చూసింది.
కూతురు లక్ తీసుకు వచ్చినట్లు ఆమె మేకింగ్‌లో భాగమైన తొలి సినిమా రవితేజకు చాన్నాళ్ల తర్వాత మంచి విజయాన్నందించే దిశగా దూసుకెళ్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఇరుముడికి తొలి రోజు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్ అంతకంతకూ పెరిగి ఈవెనింగ్, నైట్ షోలకు అంతటా హౌస్ ఫుల్స్ పడిపోయాయి. మోక్షద మున్ముందు రవితేజ సినిమాలన్నింటితోనూ అసోసియేట్ అయితే ఆశ్చర్యమేమీ లేదు. మున్ముందు ఆమె ప్రొడ్యూసర్‌గా మారి తండ్రి సినిమాలను నిర్మిస్తుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates