Movie News

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు రిలీజులు చేస్తుండటంతో ఆడియన్స్ నుంచి బ్రహ్మాండమైన మద్దతు దక్కుతోంది. అందుకే కంటెంట్ యావరేజ్ లేదా ఎబోవ్ యావరేజ్ ఉన్నా సరే సూపర్ హిట్ రేంజ్ లో కలెక్షన్లు కుమ్మరిస్తున్నారు. ప్యాన్ ఇండియా పెద్దిని మినహాయిస్తే జూన్ నుంచి ప్రతి వారం మినిమమ్ గ్యారెంటీతో గెలిచిన సినిమా ఏదో ఒకటి బయ్యర్లను ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది.

తాజాగా ఇరుముడికి వస్తున్న వసూళ్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. మంచి ఓపెనింగ్ వస్తుందని అందరికీ తెలుసు కానీ మరీ ఈ స్థాయిలో ఊచకోత ఎవరూ అనుకోలేదు. ఎంత డివోషనల్ టైటిల్ అయినా ఇదేమి భక్తి సినిమా కాదు. క్రైమ్, రివెంజ్ మిక్స్ చేసిన పక్కా ఎమోషనల్ డ్రామా. అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత రవితేజకు విజయం దక్కే అవకాశం రావడంతో ప్రతి ఒక్కరు రెట్టింపు మద్దతు ఇచ్చి నిలబెడుతున్నది నిజం.

దీనికే కాదు ఇంతకు ముందు విశ్వనాథ్ అండ్ సన్స్, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, ఒడిస్సి, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, లెనిన్ ఇలా ప్రతి ఒక్క సినిమా అసలు నష్టాలే ప్రస్తావనే లేకుండా ప్రతి ఏరియాలో బ్రేక్ ఈవెన్ దాటేశాయి. కొన్ని చోట్ల భారీ లాభాలు కూడా వచ్చాయి. నాగబంధం ఫ్లాపే కానీ తొలి మూడు రోజులు తెచ్చిన నెంబర్లు ఆషామాషీ కాదు. ఓటిటిలో విపరీతమైన కొత్త కంటెంట్ ఎంత వస్తున్నా జనాలు మాత్రం థియేటర్లకే జై కొడుతూ టికెట్లు కొంటున్నారు.

ఈ శుభ పరిణామాన్ని నిర్మాతలు గమనించాలి. జనాలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఎలాంటి కథలు చెప్పాలో విశ్లేషణ చేసుకోవాలి. ఇక్కడ చెప్పినవన్నీ ప్యాన్ ఇండియా పేరుతో వందల కోట్ల బడ్జెట్ తో తీసినవి కాదు. వేల కోట్లు వసూలు చేసేవి కాకపోవచ్చు. కాకపోతే కొన్నవాళ్లను, తీసినవాళ్లను, చూసినవాళ్లను అందరినీ సంతృప్తి పరుస్తున్నాయి. ఇప్పుడు కావాల్సింది ఇలాంటి ట్రెండే. వచ్చే వారం టాక్సిక్ కూడా దీన్ని కొనసాగించాలనేదే ప్రతి ఒక్కరి ఆకాంక్ష. 

This post was last modified on August 21, 2026 9:47 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

38 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

51 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago