Movie News

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని స్టెప్పులు వేయించడం ఎంత ప్లస్ అయ్యిందో అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకంటే ఫామ్ లో లేనివాళ్లను తీసుకొచ్చి స్పెషల్ సాంగ్స్ చేయిస్తే ఇప్పటి మాస్ జనాలు చూడటం కష్టం. కానీ పూర్ణ దానికి భిన్నంగా తన గ్రేస్ తో, ఎంత బొద్దుగా ఉన్నా సరే చూడాలనిపించేలా నృత్య భంగిమలు ఇవ్వడం బాగా రీచ్ అయ్యింది.

తాజాగా జైలర్ 2 నుంచి విడుదలైన మొదటి పాట అల బోలేలోలో పూర్ణ మరోసారి మెరిసింది. స్వతహాగా ప్రొఫెషనల్ డాన్సర్ కావడం పూర్ణకు ఈ వయసులోనూ పర్ఫెక్షన్ వచ్చేందుకు తోడ్పడుతోంది. అందుకే అంత పెద్ద స్టార్ రజినీకాంత్ ఫ్రేమ్ లో ఉన్నా కూడా తెల్లచీరలో పూర్ణ వేస్తున్న నృత్యాన్ని చూడాలనిపించేలా చేయడంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విజయం సాధించారు. అనిరుధ్ రవిచందర్ ట్యూన్ ఖంగాళీగా ఉంది కానీ స్లో పాయిజన్ అవుతుందేమో చూడాలి.

అయితే జైలర్ మొదటి భాగంలో తమన్నా చేసిన కావాలయ్యా కంటే ఇప్పుడీ పాట పెద్దగా ఎత్తున హిట్ అవుతుందో లేదో  తెరమీద పూర్తిగా చూశాక క్లారిటీ వస్తుంది. అక్టోబర్ 15  కాబోతున్న జైలర్ 2 రాకలో ఎలాంటి మార్పులు ఉండబోవడం లేదు.చెప్పిన డేట్ కే వచ్చేలా  పక్కా ప్లానింగ్ జరుగుతోంది. హృతిక్ రోషన్ అతిథి పాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న జైలర్ 2లో ముత్తువేల్ పాండియల్ ఎలాంటి విధ్వంసం చేయబోతున్నాడో కానీ ఫ్యాన్స్ అంచనాలైతే పీక్స్ లో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే జైలర్ 2 మీద మంచి క్రేజ్ ఉంది. ఎనభై కోట్ల దాకా థియేటర్ రైట్స్ అడుగుతున్నారని ట్రేడ్ టాక్. ఇంకా డీల్స్ క్లోజ్ కాలేదు. ట్రైలర్ వచ్చాక బిజినెస్ వ్యవహారాలు ఊపందుకోబోతున్నాయి. చనిపోయిన కొడుకు పాత్ర తప్ప మిగిలిన క్యారెక్టర్లన్నీ జైలర్ 2లో కొనసాగుతున్నాయి. శివరాజ్ కుమార్, మోహన్ లాల్, విజయ్ సేతుపతి క్యామియోలు సర్ప్రైజింగ్ గా ఉంటాయట. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు.  

This post was last modified on August 21, 2026 9:44 pm

Share

Recent Posts

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

15 minutes ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

23 minutes ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

2 hours ago

ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…

4 hours ago

అసలు భయాన్ని థియేటర్‌లో చూపిస్తారేమో

ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…

5 hours ago

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

7 hours ago