Movie News

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా ఫ్యామిలీ నుంచి పలువురు కుటుంబ సభ్యులతో పాటు చిరుతో పని చేసిన దర్శకులు గెస్టులుగా వచ్చారు. వాళ్లలో వసిష్ఠ ఉన్నారు. విశ్వంభర అప్డేట్ ప్రస్తావన తీసుకొచ్చి తన మీద చాలా మంది కోపంగా ఉన్నారని, ట్విట్టర్ లో వేసుకుంటున్నారని, అయినా సరే వచ్చినప్పుడు మాత్రం విశ్వంభర సాలిడ్ సౌండ్ చేస్తుందని గట్టి భరోసా ఇచ్చారు.

ఏదో పైపై పూతగా మాట్లాడినట్టు ఉంది కానీ నిజంగా విశ్వంభర ఎప్పుడు విడుదలవుతుందనేది చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఫిలిం నగర్ వర్గాల్లో ఈ సినిమా అక్టోబర్ 18 రిలీజ్ కు రెడీ అవుతుందని, రేపు దాని తాలూకు అనౌన్స్ మెంట్ వస్తుందని మాట్లాడుకున్నారు. కానీ వసిష్ఠ మాటల్లో అలాంటి నమ్మకం కనిపించలేదు. అలాంటిది ఏదైనా ఉంటే ఒక రోజు ఓపిక పట్టండి, మీకో గుడ్ న్యూస్ చెబుతాం అనే వాళ్ళుగా. మొన్న మొన్న మొదలైన మెగా 158 హడావిడే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంది.

ఈ లెక్కన 2027 సమ్మర్ కన్నా ముందు విశ్వంభర వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతికి మెగా 158 ఫిక్స్ అయిపోయింది. డేట్ రేపు చెప్పేస్తారు. అలాంటప్పుడు మెగా ఫాంటసీ మూవీకి కనీసం నాలుగైదు నెలల గ్యాప్ రావాలి. అయినా విశ్వంభరని పండక్కు రిలీజ్ చేయకుండా ఆఘమేఘాల మీద 158 రెడీ చేయడం పట్ల ఫ్యాన్స్ లోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కొరియన్ కనకరాజు హిట్ అయిన తర్వాత కూడా యువి టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

ఇదంతా ఎలా ఉన్నా విశ్వంభర మీద బజ్ దాదాపు జీరో అయిపోయినట్టే. ప్రమోషన్లు మళ్ళీ కింది నుంచి మొదలుపెట్టాలి. అసలు విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాయా లేదానేది కూడా తెలియడం లేదు. రెండు సంవత్సరాలు గ్రాఫిక్స్ మీదే గడిపేశారు. ఒడిస్సికి కూడా బహుశా ఇంత టైం పట్టలేదేమో. కానీ చిరంజీవి సినిమాకు మాత్రం సంవత్సరాలు సరిపోవడం లేదు. త్రిష హీరోయిన్ గా నటించిన విశ్వంభరకు ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం సమకూర్చగా భీమ్స్ ఒక స్పెషల్ సాంగ్ కంపోజ్ చేశారు. 

This post was last modified on August 21, 2026 9:20 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

53 minutes ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

1 hour ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

3 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

3 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

4 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

7 hours ago