Movie News

ఆర్జీవీకి శివ నిర్వాణ కూలర్ బాయ్

ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌గానో, రైటర్‌గానో చిన్న చిన్న అవకాశాల కోసం తాపత్రయ పడి.. చాలా ఏళ్లు నలిగి ఆ తర్వాత దర్శకుడిగా అవకాశం అందుకున్నాక జీవితాలను చక్కదిద్దుకున్న వాళ్లే. దర్శకుడు తేజ లాంటి వాళ్ల కష్టాలు వింటే కన్నీళ్లే వస్తాయి.

ప్రస్తుతం తెలుగులో పేరున్న దర్శకుల్లో ఒకడిగా ఎదిగిన శివ నిర్వాణ తన కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం కష్టపడ్డ రోజులను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. రామ్ గోపాల్ వర్మను చూడడం కోసం ఆయన సినిమా ఎలా తీస్తారో గమనించడం కోసం ‘రక్త చరిత్ర’ సినిమా సెట్లో కూలర్ బాయ్‌గా పని చేసిన విషయాన్ని అతను పంచుకున్నాడు.

‘రక్త చరిత్ర’ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు వర్మను కలవడానికి ప్రయత్నించానని.. ఆ క్రమంలో ఆ సినిమా సెట్లో కూలర్ బాయ్‌ పనిని తాను తీసుకున్నానని శివ నిర్వాణ వెల్లడించాడు. తాను అప్పటికే పీజీ చేసి లెక్చరర్‌గా పని చేశానని.. ఐతే వర్మను చూడడం కోసమే ‘రక్త చరిత్ర’ సినిమా సెట్‌కు వెళ్లి కూలర్ బాయ్ పనిని అనుకోకుండా తాను తీసుకున్నానని అతను వెల్లడించాడు. అప్పటికే రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పని చేస్తున్నప్పటికీ.. వర్మను దగ్గరగా చూడడం కోసం మరో అవకాశం లేక ఆ పని చేయాల్సి వచ్చిందని శివ తెలిపాడు.

ఆ సినిమాకు కూలర్ బాయ్‌గా పని చేసే వ్యక్తి దగ్గర.. కూలర్లో నీళ్లు ఎలా పోయాలి, దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అని ఒక రోజు ట్రైనింగ్ తీసుకుని.. కొన్ని రోజుల పాటు సెట్లో కూలర్ బాయ్‌గా పని చేశానని శివ గుర్తు చేసుకున్నాడు. వర్మ ఎప్పుడూ తన పనిలో తాను నిమగ్నమై ఉండేవారని.. తాను ఆ సినిమాకు కొన్ని రోజులు కూలర్ బాయ్‌గా పని చేసినట్లు ఆయనకు గుర్తుందో లేదో కూడా తనకు తెలియదని శివ చెప్పుకొచ్చాడు. నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో మెప్పించిన శివ.. లేటెస్ట్‌గా ‘ఇరుముడి’ మూవీతో పెద్ద హిట్ కొట్టినట్లే కనిపిస్తున్నాడు.

This post was last modified on August 21, 2026 9:18 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

60 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago