తరం మారింది. ఒకప్పటిలా ఇప్పటి ప్రేక్షకులు లేరు. జెన్ జీ కొత్తగా ఉంది. అభిరుచుల్లో మార్పులు వచ్చేశాయి. సినిమాలు చూసే కోణం, హీరోల ఇమేజులు. మార్కెట్ లెక్కలు ఎన్నో విషయాలు అనూహ్య రీతిలో అప్డేషన్స్ కు లోనయ్యాయి. ఇది గుర్తించిన వాళ్లే న్యూ ఏజ్ ఫిలిం మేకర్స్ అవుతున్నారు. దీన్ని పాటించిన వాళ్లే కాంపిటీషన్బి లో స్టార్లుగా నిలదొక్కుకున్నారు. అక్కినేని నాగార్జున దీని గురించి ఇటీవలే ఒక ఇంగ్లీష్ మీడియాకు అఖిల్, చైతుతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
వాటి సారాంశం చూద్దాం. గీతాంజలి చేసే నాటికి నాగార్జున పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఎంత మణిరత్నం సినిమా అయినప్పటికీ ఇతర హీరోలు అలాంటి కథను అంగీకరించడానికి ముందుకు రాలేదు. కానీ ఆ మూవీ విజయం కొత్త ఊపిరినిచ్చింది. అప్పట్లో ప్రేక్షకులు విశాల హృదయంతో ఉండేవాళ్ళు. ఏడెనిమిది ఫ్లాపులు వచ్చినా సరైన సక్సెస్ దక్కితే బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పటి ఆడియన్స్ బ్రూటల్ గా ఉన్నారు. దయా దాక్షిణ్యం లేకుండా మర్చిపోతున్నారు. ఇంకొకరు వచ్చి ఆక్రమించుకుంటున్నారు.
నాగార్జున చెప్పిన అక్షరాలా నిజం. ఎందుకంటే ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ లేదు. ఎన్టీఆర్ చిరంజీవి తరం తర్వాత ఫలానా స్టారే అగ్ర స్థానం అని చెప్పేందుకు లేకుండా పోయింది. ఒక సంవత్సరం అల్లు అర్జున్ ఉంటే మరో ఏడాది మహేష్ బాబు ఉంటాడు. ఇంకోసారి ప్రభాస్ టేకోవర్ చేస్తాడు. ఇలా సీజనల్ గా మారిపోయిన స్టార్ డంలో ఫ్లాపులు ఎక్కువగా వచ్చినా నష్టమే. అలా అడ్రెస్ లేకుండా పోయిన మాడర్న్ హీరోలు టాలీవుడ్ లోనే అరడజను ఉంటారు.
సో వాతావరణంకు తగ్గట్టు మనల్ని మార్చుకోవడం తప్ప ఇక్కడ వేరే ఆప్షన్ లేదు. నాగచైతన్య, అఖిల్ కూడా గీతాంజలి లాంటి ఎక్స్ పరిమెంట్లు చేయాలనేది నాగ్ కోరిక. కానీ వర్కౌట్ కాకపోతే వచ్చే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఒత్తిడి చేయలేని పరిస్థితి. చైతు ఒక టైంలో ట్రై చేశాడు కానీ పనవ్వలేదు. లాల్ సింగ్ చద్దా, సవ్యసాచి, యుద్ధం శరణం లాంటివి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అన్నట్టు గీతాంజలి నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెలాఖరు మళ్ళీ విడుదలవుతోంది.
This post was last modified on August 20, 2026 3:08 pm
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…