Movie News

వెంకీ త్రివిక్రమ్… ఇంకా ఆ ఒక్క కిక్ రాలేదే!

వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’. దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. వెంకీకి ఫ్యామిలీ కథలు బాగా సెట్ అవుతాయి. త్రివిక్రమ్ కూడా అలాంటి కథలను తన స్టైల్‌లో బాగా హ్యాండిల్ చేయగలడు. అందుకే ఈ కాంబో అనగానే ప్రత్యేకంగా ఏదైనా చేస్తారనే ఆసక్తి వచ్చింది. కానీ ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ మాత్రం ఆ అంచనాలకు తగ్గ సౌండ్ చేయలేదనే చెప్పాలి.

టీమ్ ముందుగా వెంకటేష్ క్యారెక్టర్‌ను చిట్టిబాబుగా పరిచయం చేసింది. ఆ తర్వాత శ్రీనిధి శెట్టి సహా మిగతా పాత్రలను ఒక్కొక్కటిగా చూపించారు. వీడియోల్లో వెంకీ కామెడీ టైమింగ్, ఫ్యామిలీ సెటప్ గురించి చిన్న హింట్స్ ఉన్నాయి. చూసినప్పుడు బాగానే అనిపించాయి. కానీ రెండు మూడు రోజుల తర్వాత కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకునేంత స్టఫ్ మాత్రం వాటిలో రాలేదు.

అదే టైమ్‌లో అనిల్ రావిపూడి చేస్తున్న వెంకటేష్ కళ్యాణ్ రామ్ సినిమా నుంచి వచ్చిన సరదా వీడియోలు మాత్రం వెంటనే క్లిక్ అయ్యాయి. అవి సినిమాలోని సీన్లు కూడా కావు. హీరోలు, హీరోయిన్లతో బయట చేసిన చిన్న ఫన్ వీడియోలే. అయినా సోషల్ మీడియాలో బాగా తిరిగాయి. సినిమా ఏంటి అనే దానికంటే ముందు కాంబినేషన్‌ను జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆ టీమ్ సక్సెస్ అయింది.

‘ఆదర్శ కుటుంబం’ విషయంలో మాత్రం త్రివిక్రమ్ ఇప్పటివరకు అలాంటి హడావుడి చేయడం లేదు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇంట్లో వాళ్లు ఎలా ఉంటారు అనే పరిచయం వరకే ఆగిపోయారు. అసలు కథ ఏమిటి, వెంకీ త్రివిక్రమ్ కాంబోలో ప్రత్యేకంగా ఏముంది అనే హుక్ ఇంకా బయటకు రాలేదు. అందుకే మొదటి అప్డేట్స్ వచ్చినా ఎక్కువ రోజులు గుర్తుండకుండా పోయాయి.

అయితే దీన్నిబట్టి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం క్లిక్ కాలేదని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే పాటలు, పూర్తి టీజర్, ట్రైలర్ ఇంకా రావాల్సి ఉన్నాయి. త్రివిక్రమ్ కూడా మొదట క్యారెక్టర్లను పరిచయం చేసి, తర్వాత నెమ్మదిగా అసలు స్టఫ్ వదిలే ప్లాన్‌లో ఉండొచ్చు. కాంబినేషన్‌కు కావాల్సిన క్రేజ్ అయితే ముందే ఉంది. ఇప్పుడు దానికి సరిపోయే ఒక్క గట్టి వీడియో లేదా పాట పడాలి. అప్పటివరకు ‘ఆదర్శ కుటుంబం’ మీద అంచనాలు ఉన్నాయి కానీ, బయట సౌండ్ మాత్రం కాస్త తక్కువగానే ఉంది. మరి త్రివిక్రమ్ ఇదే సైలెంట్‌గా తీసుకెళ్తాడా.. లేక అసలు స్టఫ్‌తో ఒక్కసారిగా బజ్ పెంచుతాడా చూడాలి.

This post was last modified on August 19, 2026 9:42 am

Share

Recent Posts

ఏపీ లోక‌ల్ వార్‌… జ‌గ‌న్ తెలుసుకోవాల్సింది ఇదే.. !

స్థానిక ఎన్నిక‌ల సమ‌రంలో ఇప్ప‌టి వ‌ర‌కు జరిగింది 25 శాతం మాత్ర‌మే!. మునిసిపాలిటీలు, మునిసిప‌ల్ కార్పొరే ష‌న్ల‌కు మాత్ర‌మే ఎన్నిక‌ల…

33 minutes ago

14 ఏళ్ల కింద‌టి విడాకుల పిటిష‌న్‌పై హైకోర్టు తీర్పు

విడాకుల కేసుల‌ను గ‌రిష్ఠంగా ఏడాదిలో ప‌రిష్క‌రించాల‌ని.. సుప్రీంకోర్టు గ‌తంలోనే దేశంలోని హైకోర్టుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. విడాకుల కేసులలో…

42 minutes ago

పుంగ‌నూరులో పెద్దిరెడ్డి సీన్ ఇంత రివ‌ర్సా… ?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌కు కంచుకోట‌గా ఉంద‌ని భావించిన పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ…

2 hours ago

ఇలా అయినా హిట్టు పడుతుందా?

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఆయన తనయుడు మహేష్ బాబు మాత్రమే పెద్ద స్టార్ అయ్యాడు.…

3 hours ago

పాల‌పిట్ట‌ – ద‌స‌రా – స‌జ్జ‌నార్ ఆదేశాలు… అసలేంటి లింకు?

తెలంగాణ‌లో పాల‌పిట్ట‌ల‌ను విక్ర‌యించే వారికి సీపీ స‌జ్జ‌నార్ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. పాల‌పిట్ట‌ల‌ను ప‌ట్టుకున్నా.. వాటిని బంధించినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని…

9 hours ago

లక్ష్మికి ఇంకొంచెం సమయం దొరికి ఉంటే

ఒకపక్క రజనీకాంత్ జైలర్ 2, ఇంకోవైపు ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. రెండూ మంచి బజ్ తెచ్చుకున్నాయి. బడ్జెట్, బిజినెస్…

10 hours ago