Movie News

టాక్సిక్ రేట్ల పెంపుని సమర్దించుకోగలరా

ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ఏపీ తెలంగాణలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కానుంది. బడా సంస్థ పంపిణి హక్కులు తీసుకోవడంతో దీనికి పెద్ద ఎత్తున థియేటర్లు దక్కేలా సిద్ధం చేశారని డిస్ట్రిబ్యూటర్ వర్గాల టాక్. అయితే ఏపీలో టికెట్ రేట్ల పెంపు దిశగా అడుగులు పడుతున్నాయని విశ్వసనీయ సమాచారం. తెల్లవారుఝామున వేసే స్పెషల్ షోలకు అయిదు లేదా ఆరు వందల రూపాయల రేట్ పెట్టి ఆ తర్వాత వారం పది రోజుల పాటు టికెట్ మీద 50 నుంచి 100 మధ్యలో పెంపు తీసుకోవచ్చని వినికిడి.

నిజమా కాదానేది నిర్ధారణ కాలేదు కానీ డబ్బింగ్ సినిమాల మీద ఇలాంటి ప్రేమ చూపించడం కొత్త కాదు. గతంలో కూలి, కాంతార, కెజిఎఫ్ లాంటి భారీ సినిమాలకు హైక్స్ ఇచ్చిన దాఖలాలున్నాయి. కానీ టాక్సిక్ విషయంలో జనం నుంచి అంత సానుకూలత వస్తుందా అనేది అనుమానంగానే ఉంది. తీసింది కన్నడలో. బైలింగ్వల్ అంటూ ఇంగ్లీష్ లో కూడా సమాంతరంగా షూట్ చేశారు. తెలుగుతో సహా ఇతర అన్ని భాషల్లోనూ అనువాదం రూపంలోనే వస్తుంది.

నిర్మాత పెట్టిన బడ్జెట్, అమ్మిన హక్కులు అన్నీ ఒరిజినల్ భాషకు సంబంధమే అయ్యుంటాయి తప్ప, పక్క రాష్ట్రంలో పెంచుకునే అవకాశం ఉంది కదాని ఖర్చు పెట్టుకుంటూ పోరు. టాక్సిక్ ఫాంటసీ మూవీ కాదు. విజువల్ గ్రాఫిక్స్ ని ఆధారంగా చేసుకున్న బాహుబలి, హనుమాన్ తరహా సినిమా కాదు. వందల కోట్లు కుమ్మరించారు నిజమే. కానీ పూర్తిగా యాక్షన్ అడ్వెంచర్ మూవీ. అలాని చెప్పి ఇలా తెలుగు వెర్షన్ నుంచి ఎక్కువ రెవిన్యూ రాబట్టలనుకోవడం సబబానేది ప్రశ్న.

టాక్సిక్ తీస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ కు టాలీవుడ్ లో మంచి బాండింగ్స్ ఉన్నాయి. చిరంజీవి బాబీల మెగా 158 తీస్తున్నది వీళ్ళే. అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీని తెరకెక్కిస్తున్నది కూడా ఈ ప్రొడక్షన్ హౌసే. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు రెడీ చేసి పెడుతోంది. టికెట్ పెంపు అనుమతులకు వీటితో సంబంధం లేదు కానీ ప్రభుత్వం ఎలాగూ ఇలాంటి విషయాల పట్ల ఉదారంగా ఉంది కాబట్టి జీవో వచ్చినా ఆశ్చర్యం లేదు. అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేదాకా ఏదీ నిర్ధారణగా చెప్పలేం.  

This post was last modified on August 18, 2026 4:56 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

58 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

4 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

4 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

6 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

6 hours ago