అయ్యగారి ఫ్యాన్.. కరెక్ట్ గా వాడుకున్నారు కానీ..

‘అయ్యగారే నెంబర్ వన్’ డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు మళ్లీ వైరల్ అవుతున్నాడు. రీసెంట్ గా ‘లెనిన్’ మూవీ సక్సెస్ మీట్ లో అఖిల్ ను కలిసి ఎమోషనల్ అయిన అతను, ఇప్పుడు ఏకంగా ఒక సినిమా అనౌన్స్ మెంట్ వీడియోలో మెరిశాడు. ‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’ అనే కొత్త చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోలో నాగరాజు కనిపించడంతో నిజంగానే సినిమాలో ఛాన్స్ వచ్చిందా అనే టాక్ మొదలైంది.

ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో స్టార్టింగ్ నుంచి నాగరాజుతోనే డిజైన్ చేశారు. ఇందులో సైకిల్ మీద తిరుగుతూ గోడలకు సినిమా పోస్టర్లు అతికించే కుర్రాడిగా కనిపించాడు. ఆ పోస్టర్ ను ఫోకస్ చేస్తూ మోషన్ పోస్టర్ స్టైల్ లో టైటిల్ రివీల్ చేయడం భలే అనిపించింది. దీన్నిబట్టి పబ్లిసిటీ కోసమే వాడుకున్నారా లేక సినిమాలో కూడా ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మేకర్స్ కూడా దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

నిజానికి నాగరాజును ఈ అనౌన్స్ మెంట్ కు వాడటం వెనక మంచి లాజిక్ ఉంది. ఈ సినిమా కథ మొత్తం అభిమాన సంఘాల చుట్టూనే తిరగబోతోంది. వివేక్ దండు, సంగీర్తన విపిన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో హీరో మెగాస్టార్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా కనిపిస్తే, హీరోయిన్ బాలయ్య వీరాభిమానిగా కనిపించనుంది. వాళ్లిద్దరి మధ్య జరిగే ఫ్యాన్ వార్ కాన్సెప్ట్ గా కథ నడవనుందని టాక్.

నిజ జీవితంలో హీరోల కోసం పిచ్చెక్కిపోయే ఒక వైరల్ ఫ్యాన్ తో ప్రమోషన్ స్టార్ట్ చేయడం మంచి ఐడియానే. జస్ట్ మీమ్స్ కే పరిమితం అయిన నాగరాజు లైఫ్ లెనిన్ సక్సెస్ తో కాస్త టర్న్ తీసుకుంది. అఖిల్ ను నేరుగా కలవడం, ఆ వీడియో వైరల్ అవ్వడంతో జనాల్లో ఆయనకు మంచి సింపతీ క్రియేట్ అయింది. ఇప్పుడు అదే ఇమేజ్ ను వాడుకుంటూ మేకర్స్ కెమెరా ముందుకు తీసుకొచ్చారు. 

అయితే చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించిన మెయిన్ కాస్ట్ లిస్ట్ లో నాగరాజు పేరు ఎక్కడా లేదు. దీన్నిబట్టి సినిమాలో క్యారెక్టర్ ఉందా లేదా అని ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. బహుశా అనౌన్స్ మెంట్ బజ్ కోసమే ఇలా ప్లాన్ చేసి ఉంటారా అనే డౌట్ వస్తోంది. పూర్తి నటీనటుల వివరాలు బయటకు వస్తే కానీ ఈ డౌట్ క్లియర్ కాదు. విరూపాక్ష సినిమాతో డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న కార్తీక్ దండు సొంత తమ్ముడే ఈ వివేక్ దండు. సీహెచ్ రవికిషోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ లో సప్తగిరి, రాజా రవీంద్ర, బాబు మోహన్ లాంటి సీనియర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.