విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు కొట్టిన దర్శకుల్లో రాజమౌళి, అనిల్ రావిపూడి తర్వాత స్థానం వెంకీ అట్లూరిదేనని జనాలు పొగడ్తలు గుప్పిస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ వారసుడంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాలు ఇతర భాషల హీరోలతో తీసినవి కావడం గమనార్హం. ధనుష్, దుల్కర్ సల్మాన్, సూర్య వీళ్ళెవరూ మన వాళ్ళు కాదు.
ఇప్పుడు వెంకీ అట్లూరి నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారనే దాని మీద రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. నాగచైతన్య అంటే బాగా ఇష్టపడే వెంకీకి ఈసారి ఛాన్స్ వస్తే వదిలిపెట్టరు. విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఆ అభిమానాన్ని బయట పెట్టుకున్నారు కూడా. పక్క రాష్ట్రాల హీరోలతో చేసి హిట్లు కొడుతున్నప్పటికీ వాటి ఒరిజినల్ వెర్షన్లు ఆయా రాష్ట్రాల్లో తెలుగు కన్నా గొప్పగా పెర్ఫార్మ్ చేయలేకపోవడాన్ని వెంకీ పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది.
దాని బదులు నేరుగా టాలీవుడ్ హీరోతోనే చేస్తే ఇంకా గొప్ప ఫలితం అందుకోవచ్చనేది ఆలోచనగా కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు లాంటి సినిమాలు ప్యాన్ ఇండియా రిలీజ్ లేకుండానే కేవలం తెలుగు వెర్షన్ తో మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు సృష్టించాయి. వాటిని పక్క భాషల్లో కనీసం డబ్బింగ్ కూడా చేయలేదు. ఇప్పటికీ అనిల్ అదే సూత్రాన్ని పాటిస్తూ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు.
సో వెంకీ అట్లూరి కనక ఈ వాస్తవాన్ని ఒంటబట్టించుకుంటే తను కూడా ఇలాంటి అద్భుతాలు చేయొచ్చు. వేరే లాంగ్వేజ్ హీరోల వల్లే వాటి కలెక్షన్లు డబుల్ సెంచరీ చేయలేకపోయాయనేది ఒప్పుకోవాల్సిన నిజం. తమిళ జనాల మద్దతు పూర్తిగా దక్కపోవడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ కరుప్పుని దాటడం కష్టమని కోలీవుడ్ బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. సో వెంకీ అట్లూరి తర్వాత చైతుతో చేయి కలుపుతాడా లేక ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న చిరంజీవికి కథ చెబుతారా లెట్ వెయిట్ సీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates