ప్రస్తుతమున్న సంగీత దర్శకుల్లో టయర్ 2 సినిమాలకు ఎక్కువ అందుబాటులో ఉండి, తక్కువ టైంలో పని పూర్తి చేసి ఇచ్చేది జివి ప్రకాష్ కుమారేనన్నది చాలా మంది ఒప్పుకునే మాట. అందులోనూ బడ్జెట్ కూడా రీజనబుల్ గా ఖర్చవుతుంది. భయపడే రెమ్యునరేషన్లు తీసుకోడనే టాక్ టాలీవుడ్ లోనూ ఉంది. అయితే మొన్నటిదాకా తన మేజిక్ టచ్ తో ఎన్నో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చిన జివి పనితనం ఈ మధ్య ఆశించిన స్థాయిలో లేదనే మాట మ్యూజిక్ లవర్స్ కి వినిపిస్తోంది.
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ సూపర్ డూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది. ఇందులో డౌట్ లేదు. అయితే కంటెంట్ పరంగా ఎన్ని ప్రశంసలు వచ్చినప్పటికీ సంగీతానికి ఆ స్థాయి స్పందన రాలేదన్నది వాస్తవం. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి అదిరిపోయే పాటలు పడితే నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతాయి. అల వైకుంఠపురములోకి జరిగింది ఇదే. ఎక్కడ చూసిన ఆ సాంగ్సే వినిపించాయి. కానీ సూర్య మూవీకి అంత స్పందన అయితే లేదనే చెప్పాలి.
ఇది పక్కనపెడితే విశాల్ మకుటంకు కంపోజ్ చేసింది కూడా జివినే. సినిమా బాలేదనేది వేరే విషయం. కానీ బిజిఎం, పాటలు సైతం కంటెంట్ తో పోటీ పడితే నిరుత్సాహం కాక ఇంకేం మిగులుతుంది. వీటికన్నా ముందు శ్రీనివాస మంగాపురం అస్సలు ఆడలేదు. అజయ్ భూపతి లాంటి టేస్ట్ ఉన్న దర్శకుడు సైతం జివి నుంచి బెస్ట్ రాబట్టుకోలేదు. గతంలో వెంకీ అట్లూరి తీసిన ధనుష్ సార్ లో మాస్టారు మాస్టారు క్లాస్ మాస్ తేడా లేకుండా ఎంత మందిని ఊపేసిందో ఎవరూ మర్చిపోలేదు.
ఇప్పుడు ఇరుముడితో మళ్ళీ పలకరించబోతున్నాడు జివి ప్రకాష్. ముత్యాల పల్లకి సాంగ్ కు ఎంత పేరొచ్చినా దాని క్రెడిట్ ఇతనికి ఇవ్వలేం. ఆల్రెడీ వాడుకలో ఉన్న పాట కాబట్టి కౌంట్ లోకి రాదు. మరి మిగిలిన పాటలు బాగా రిచ్ అయ్యాయా అంటే సమాధానం ఔనని రాదు. ఎక్కడో ఏదో మిస్ అవుతోంది. పని ఒత్తిడి వల్ల క్వాలిటీ తగ్గిపోయిందా లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది జివి ప్రకాష్ కుమార్ పునఃసమీక్షించుకోవాలి. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ, ఆకాశంలో ఒక తార రెండూ తన చేతిలోనే ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates