ఎల్లుండి విడుదల కాబోతున్న కొరియన్ కనకరాజుకి రేపు రాత్రి ప్రీమియర్లు వేయడం దాదాపు ఫిక్స్. ఇంకా టికెట్ల అమ్మకాలు మొదలుకాలేదు కానీ వరుణ్ తేజ్ చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ఉంటాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా ప్రధాన కేంద్రాల్లో షోలు వేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఓకే అయిన వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతారు. నిన్న భీమవరంలో జరిగిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ప్రమోషన్ల పర్వం క్లైమాక్స్ కు చేరుకుంది.
ఇక అన్న చెల్లి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. కొన్ని నెలల క్రితం నీహారిక కొణిదెల నిర్మాతగా వచ్చిన ‘రాకాస’ డీసెంట్ గా ఆడింది. కమర్షియల్ గా పెద్ద అద్భుతాలు చేయలేదు కానీ వసూళ్ల పరంగా వర్కౌట్ చేసుకుని బయ్యర్లకు కాసిన్ని లాభాలు ఇచ్చింది. అది హారర్ కామెడీ కావడం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం. చివర్లో కొంత సీరియస్ టర్న్ తీసుకున్నప్పటికీ టైటిల్ నుంచి చివరి దాకా ఎంటర్ టైన్ చేయడం లక్ష్యంగా పెట్టుకుని రాకాస తీశారు దర్శకురాలు మానస.
ఇప్పుడు కొరియన్ కనకరాజు కూడా ఇదే క్యాటగిరీలో వస్తోంది. ఒక కొరియన్ గ్యాంగ్ స్టర్ దెయ్యం ఎక్కడో అనంతపురం జిల్లాలో ఉండే పెనుకొండ కుర్రాడి ఒంట్లోకి ఎందుకు వచ్చిందనే పాయింట్ మీద దర్శకుడు మేర్లపాక గాంధీ వినోదాత్మకంగా రాసుకున్నారు. ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే జనాల్లో ఆసక్తి రేపేలానే ఉంది. వరుణ్ తేజ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మెగా ఫ్యామిలీకి మన శంకరవరప్రసాద్ గారు, పెద్ది తర్వాత మరో హిట్ దక్కుతుందనే ధీమా చూపిస్తున్నాడు.
కాన్సెప్ట్ కనక కనెక్ట్ అయ్యి ప్రేక్షకులను మెప్పించగలిగితే కొరియన్ కనకరాజుకు మంచి రెవిన్యూ వస్తుంది. బాక్సాఫీస్ వద్ద స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తప్ప జోరు చూపిస్తున్న సినిమాలు లేవు. శ్రీనివాస మంగాపురం ఫలితం ఆల్రెడీ తేలిపోగా చెన్నై లవ్ స్టోరీ ఇప్పటికే నెమ్మదించేసింది. మాస్ ని లక్ష్యంగా చేసుకున్న సినిమాగా లెనిన్ సూపర్ హిట్ కొట్టింది కానీ దాంట్లో కామెడీ లేదు. ఒకవేళ కొరియన్ కనకరాజు కనక ఫుల్లుగా నవ్విస్తే ఓ రెండు వారాలు థియేటర్ రన్ కు ఢోకా లేనట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates