ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను బట్టి తర్వాతి చిత్రాలను ఊహించుకుంటారు. గత ఏడాది ‘దండోరా’ అనే హార్డ్ హిట్టింగ్ సినిమా తీసిన మురళీకాంత్ మెప్పించిన కొత్త దర్శకుడి నుంచి తర్వాత కూడా అలాంటి సందేశాత్మక చిత్రాలే వస్తాయని అందరూ అనుకుని ఉంటారు. కానీ అతను మాత్రం అందుకు పూర్తి భిన్నమైన ప్రేమకథా చిత్రాన్ని ఎంచుకుని ఆశ్చర్యపరిచాడు.
మురళీకాంత్‌కు నేచురల్ స్టార్ నాని ఛాన్స్ ఇస్తున్నాడని, తన నిర్మాణంలో సినిమా చేయిస్తున్నాడని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. అది నిజమే అని తేలింది. ఊహించని విధంగా యువ కథానాయకుడు నితిన్‌ను హీరోగా పెట్టి మురళీ కాంత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాని రెడీ అయ్యాడు. ఈ కలయికలో రాబోతున్న కొత్త చిత్రానికి ‘అలియాస్ రుక్మిణీ’ అనే టైటిల్ పెట్టి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
రుక్మిణీ అనే పెన్ నేమ్ పెట్టుకుని శృంగార రచనలు చేసే రైటర్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడు నితిన్ ఇందులో. ఆ విషయాన్ని టీజర్లో భలే ఫన్నీగా చూపించారు. ఐతే చివర్లో ఏమో రుక్మిణీ అంటే తన భార్య పేరు అంటాడు హీరో. ఆ ట్విస్ట్ ఏంటన్నది సినిమాలోనే చూడాలేమో. ‘దండోరా’ దర్శకుడి నుంచి ఇలాంటి ఫ్లెజెంట్ లవ్ స్టోరీ రాబోతుండడమే అతి పెద్ద విశేషం. టీజర్లో ఇంకో పెద్ద విశేషం.. విజయ్ బుల్గానిన్ బీజీఎం.
‘బేబి’తో అంచనాలు పెంచిన విజయ్.. మరోసారి తన మార్కు చూపించేలా ఉన్నాడీ సినిమాలో. ఈ చిత్రాన్ని ‘యునానిమస్ ఫిలిమ్స్’ బేనర్ మీద నాని సమర్పిస్తుండగా.. అతడి అక్క, గతంలో ‘మీట్ క్యూట్’ అనే ఓటీటీ సినిమాను డైరెక్ట్ చేసిన దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నానికి ‘వాల్ పోస్టర్ సినిమా’ పేరుతో ఇంకో బేనర్ ఉండగా.. దాన్ని నాని ఫ్రెండ్ ప్రశాంతి మేనేజ్ చేస్తోంది. ఆ బేనర్లో వచ్చే ఏడాది ‘హిట్-4’ సినిమా రాబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
