జూలై చివరి వారం… OTT ఆప్షన్ల వర్షం

థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు ఓటిటిలో కూడా ఈ వారం చాలా కంటెంట్ రాబోతోంది. ఇంట్లోనే కాలక్షేపం పొందాలనుకునే వాళ్లకు బోలెడు ఆప్షన్లు తీసుకొస్తోంది. పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత డిజిటల్ లోనూ పెద్దగా సౌండ్ చేసే సినిమాలేవీ రాలేదు. కానీ ఈసారి ఆ సమస్య లేదు. చాలా మటుకు జనాలు బిగ్ స్క్రీన్ మీద మిస్సయినవి ఒకేరోజు మూకుమ్మడిగా పలకరించబోతున్నాయి.

మొదటిది ‘రావు బహదూర్’. సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ డిఫరెంట్ డ్రామాని ఎందరో ప్రముఖులు, ఒక వర్గం విమర్శకులు తెగ మెచ్చుకున్నారు కానీ కమర్షియల్ గా ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయింది. వసూళ్ల పరంగా చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదు కాలేదు. ఇలాంటివి ఓటిటిలో ఆదరణ దక్కించుకుంటాయి. మరి జనాలు ఆ స్థాయిలో ఆదరిస్తారా లేదానేది వేచి చూడాలి. నెట్ ఫ్లిక్స్ కాబట్టి బహుభాషల్లో ప్రపంచవ్యాప్తంగా రీచ్ ఎక్కువగా ఉంటుంది.

ఊహించని హీరోయిన్ ట్విస్టుతో ఆడియన్స్ కి షాక్ ఇచ్చిన ‘దీవానా’ అదే రోజు రానుంది. తెలంగాణ నేటివిటీ కావడంతో నైజామ్ కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరుగా ఆడింది కానీ ఓవరాల్ రిజల్ట్ మాత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడెలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మలయాళం డబ్బింగ్ ‘బాలన్ ది బాయ్’ మన దగ్గర రెండో వారంలోనే కనిపించలేదు. దీనికీ పబ్లిసిటీ సౌండ్ చేశారు కానీ పనవ్వలేదు. విష్ణు విశాల్, ఐశ్యర్య లక్ష్మి ‘గట్టా కుస్తీ 2’ కూడా స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది

శ్రీకాంత్ నటించిన వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’కు మెల్లగా అటెన్షన్ వస్తోంది. చిరంజీవితో ట్రైలర్ లాంచ్ చేయించారు. ఇది తమిళ సిరీస్ కి రీమేక్. వీరభద్రుడులో కూతురు చనిపోయిన తండ్రిగా గుర్తుండిపోయిన ఇంద్రన్, రోజా ఫేమ్ మధుబాల నటించిన ‘చిన్ని చిన్ని ఆశ’ రెండు రోజుల క్రితమే వచ్చి కాసింత సౌండ్ చేస్తోంది. రెండేళ్ల క్రితం కొరియన్ మూవీ ‘ఘోస్ట్ ట్రైన్’ తాజాగా తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చింది. సో ఇన్నేసి ఆప్షన్లు ఉంటే ఇంటి ప్రేక్షకులకు ఇంకేం కావాలి.